గంజాయి స్మగ్లింగ్ కేసులో ఏపీ టీడీపీ మహిళా నేత అరెస్ట్.. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నారంటే

0
892

గంజాయి స్మగ్లింగ్ కేసులో ఏపీ టీడీపీ మహిళా నేత జాహ్నవిని ఆదివారం తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన జాహ్నవిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. 2013లో నమోదైన గంజాయి స్మగ్లింగ్ కేసులో జాహ్నవి హస్తం ఉందని గుర్తించారు సైబరాబాద్ పోలీసులు. గంజాయి తరలింపు లో NDPC Act లో నలుగురిపై కేసు నమోదవ్వగా ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడైన మరో వ్యక్తి శ్రీనివాస్ పరారీలో ఉండగా అతని కోసం గాలిస్తున్నారు. టీడీపీ నుంచి మానుకొండ జాహ్నవిని సస్పెండ్ చేసినట్లు పార్టీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ బచ్చుల అర్జునుడు ప్రకటించారు. 2019 ఎన్నికల అనంతరం జాహ్నవి టీడీపీలో చేరారని.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ నుండి సస్పెండ్ చేశామని ప్రకటించారు. గంజాయి కేసులో తుదితీర్పు వచ్చి, నిజనిజాలు తేలే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు.