More

    100 మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేశామంటున్న బుద్ధా వెంకన్న

    టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. తమ అధినేత చంద్రబాబుపై చెత్త వాగుడు వాగితే చంపడానికైనా, చావడానికైనా తాము సిద్ధమేనని చెప్పారు. వంద మందితో సూసైడ్ బ్యాచ్ ని తయారు చేశామని అన్నారు. చంద్రబాబు జోలికి కానీ, ఆయన కుటుంబం జోలికి గానీ వస్తే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు. చంద్రబాబును తిడితేనో, టీడీపీ ఆఫీసులపై దాడి చేస్తేనో పదవులు వస్తాయనే భ్రమల్లో నుంచి బయటకు రావాలని చెప్పారు. సీనియర్ నేతలను కాదని జోగి రమేశ్ కు మంత్రి పదవి ఎలా వచ్చిందని వెంకన్న ప్రశ్నించారు.

    బుద్ధా వెంకన్న వ్యాఖ్యలపై గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పందించారు. 100 మందితో సూసైడ్ బ్యాచ్‌ను తయారు చేసుకున్నామని ఎలా మాట్లాడుతారని విమర్శించారు. చంద్రబాబు పుట్టినరోజు నాడు కేక్ కట్ చేసుకోకుండా.. బుద్ది లేకుండా బుద్ధా వెంకన్న మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబే సూసైడ్ బ్యాచ్‌ను తయారు చేసి వదిలారని రమేష్ వ్యాఖ్యానించారు. మేం వాళ్లని టచ్ చేయాల్సిన అవసరం లేదని.. జనమే ఓట్లతో సమాధానం చెప్పారని మంత్రి అన్నారు. న్యాయం కోసం వెళ్లిన తననే అప్పట్లో కొట్టించారని జోగి రమేష్ ఆరోపించారు.

    Trending Stories

    Related Stories