చంద్రబాబు బెయిల్ పై విచారణ రేపటికి వాయిదా..!

0
134

ఏపీ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణకు విజయవాడ ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇవాళ న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ రెగ్యూలర్ న్యాయమూర్తి సెలవులో ఉండటంతో నేడు విచారణ చేపట్టడం సాధ్యం కాదని ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. బెయిల్ పిటిషన్ పై ఇవాళే వాదనలు వినాలని చంద్రబాబు తరుపు లాయర్లు ప్రమోద్ కుమార్ దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అయితే ఈ రోజు వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని జడ్జి స్పష్టం చేశారు. రేపటి నుంచి తాను సెలవుపై వెళ్లనున్నట్లుగా తెలిపారు. రేపు రెగ్యులర్‌ కోర్టులో వాదనలు వినిపించాలని సూచించారు.

రెండు రోజుల కస్టడీలో కూడా విచారణకు చంద్రబాబు సహకరించలేదని, మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ తరుపున న్యాయవాదులు పిటీషన్ వేశారు. నిన్న న్యాయమూర్తి రెండు కేసులను ఈరోజుకు వాయిదా వేశారు. అయితే ఈరోజు సెలవులో ఉండటంతో రెండు కేసులు రేపు ఏసీబీ కోర్టులో విచారణకు రానున్నాయి.