National

ముంబై ఎయిర్ పోర్టు మూసివేత.. సిద్ధంగా ఉన్న భారత సైన్యం

తౌక్తా తుపాను గుజరాత్ వైపు వెళుతూ ఉంది. దీని ప్రభావం ముంబై మీద చూపిస్తూ ఉంది. ఇప్పటికే కేరళ, కర్ణాటక, మహా రాష్ట్రలలో భారీ వర్షాలు కురిశాయి. ముంబై ఎయిర్ పోర్టును రాత్రి 8 గంటల వరకూ మూసి వేశారు.

తౌక్తా తుపానును భారత ఆర్మీ కూడా నిశితంగా పరిశీలిస్తూ ఉంది. 180 బృందాలను సిద్ధంగా ఉంచారు. ఎప్పటికప్పుడు అధికారులతో ఆర్మీ బృందాలు చర్చిస్తూ ఉన్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ఈ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్, గోవా ముఖ్యమంతులతో మాట్లాడారు. డయ్యు-డామన్ లెఫ్టినెంట్ గవర్నర్ తో కూడా మోదీ ఫోన్ లో మాట్లాడారు.

ముంబైలో వర్షం ఎక్కువగా ఉండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వకుండా ప్రణాళికలు రచించామని ఉద్ధవ్ థాక్రే వెల్లడించారు. ప్రాణ నష్టం కలుగకుండా అన్ని చర్యలూ తీసుకుంటూ ఉన్నామని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తున్నాయని అన్నారు.

తుఫాను గుజరాత్‌లో ఈ రోజు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని తీర ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. గుజరాత్‌ తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపుసహాయక చర్యల కోసం 54 ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. కేరళలోని 9 జిల్లాల్లో తౌక్తా తుపాను ప్రభావంఎక్కువగా వుంది. ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటకలోని 7 జిల్లాల్లో తౌక్తా తుపాను ప్రభావం ఎక్కవగా వుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 − 3 =

Back to top button