More

    ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు: తరుణ్ చుగ్

    మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. బీజేపీ దేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిందని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. కొన్ని అంశాలను తాము వెల్లడించాలని భావించినప్పటికీ, మునుగోడు ఉప ఎన్నిక ఉండడంతో, దానివల్ల లబ్దిపొందుతామన్న ఆరోపణలు వస్తాయని మౌనంగా ఉండిపోయామని అన్నారు. తాము చూపించనున్న వీడియో ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, దేశంలోని అన్ని మీడియా సంస్థలకు ఈ వీడియో పంపించామని, అన్ని రాష్ట్రాల సీఎంలకు, పార్టీల అధ్యక్షులకు, హైకోర్టు చీఫ్ జస్టిస్ లకు కూడా వీడియో పంపిస్తామని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చూపించిన వీడియోలో బేరసారాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

    ఇక ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీకి సంబంధం లేదని తరుణ్ చుగ్ తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురు నిందితులకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయన్నది అబద్ధమన్నారు. సొంత ఎమ్మెల్యేలపై కేసీఆర్కు విశ్వాసం లేదని అన్నారు. ప్రధాని మోదీపై కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తరుణ్ చుగ్ మండిపడ్డారు. ప్రధాని కావాలని కేసీఆర్ కలలుకంటున్నాడని.. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ప్రధానమంత్రి కావొచ్చన్నారు. కేసీఆర్ అహంకారం మునుగోడు ఫలితంతో తగ్గుతుందన్నారు. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారన్న చుగ్.. మునుగోడు ప్రజలకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

    Trending Stories

    Related Stories