రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు వైసీపీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని వైసీపీకి ప్రజలు ఓట్లు వేయాలని ఆయన ప్రశ్నించారు. వైసీపీ చెప్పినవన్నీ కేంద్రం ఇచ్చిన పథకాలే అని.. వాటినే వైసీపీ ఇంటింటికీ ప్రచారం చేసుకుంటోందని అన్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ పసుపు-కుంకుమ ఇచ్చినా జనం పక్కన పెట్టారని తెలిపారు. వైసీపీని కూడా ఈసారి ప్రజలు తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు ఓ అవగాహనతో ఉన్నాయని, మూడో పార్టీని రాష్ట్రంలో రానీయకుండా చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఒక్కరే ఉండటం రాష్ట్రంలో మనం చూస్తున్నామని తెలిపారు. తమిళనాడు తరహా రాజకీయాలు ఇప్పుడు ఏపీలో చూస్తున్నామన్నారు. మంత్రులు కూడా ముఖ్యమంత్రి కాళ్లపై పడటం ఏంటని ప్రశ్నించారు.
ఏపీ మంత్రి రోజా, తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితలు మహిళా నాయకురాళ్లుగా ఉంటూ చీరలు, చుడీదార్లను లోకువ చేసి మాట్లాడుతున్నారని, ఇది మహిళలను కించపరచడమేనని జీవీఎల్ ట్విట్టర్ లో విమర్శించారు. మహిళలను మహిళలే అగౌరవపర్చడం రోజా, అనితలకు తప్పనిపించడం లేదా..?.. మహిళలకు ఇచ్చే గౌరమిదేనా..? ఆత్మ పరిశీలన చేసుకోవాలని విమర్శించారు.