National

నీట్ ను అడ్డుపెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం రాజకీయాలు: బీజేపీ

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) నుంచి తమిళనాడు విద్యార్థులకు ఉపశమనం ఇవ్వాలని కోరుతూ తమిళనాడు అసెంబ్లీలో సోమవారం నాడు నీట్ వ్యతిరేక బిల్లును ఆమోదించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు ఒక్క భారతీయ జనతా పార్టీ మినహా అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. రాష్ట్రంలోని సేలం జిల్లాలో నీట్ పరీక్షకు ముందు 20 ఏళ్ల ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ ‘‘మీరు (ఏఐడీఎంకే) కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉన్నారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. సీఏఏ, వ్యవసాయ చట్టాల విషయంలో మీరు ఏమీ చేయలేదు. నీట్ విషయంలో అయినా కొన్ని షరతులు పెట్టి ఉండాల్సింది. కానీ మీకు గొంతులు పెంచేంత ధైర్యం లేదు. ఆశావాహులు చనిపోతుంటే మీరు మౌనంగా ఉన్నారు’’ అని అన్నాడీఎంకే నేతలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. నీట్‌ను రద్దు చేయడానికి ప్రభుత్వం దశల వారీగా కృషి చేస్తుందని స్టాలిన్ అన్నారు.

నీట్‌ను అడ్డుపెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని తమిళనాడు భారతీయ జనతా పార్టీ విమర్శించింది. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళనాడు బీజేపీ అధినేత కె.అన్నామలై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కొద్ది రోజుల క్రితం ధనుష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం కనిమొజి అనే అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థులను ఇలాంటి పనులు చేయకండని వేడుకుంటున్నానని’ ఆయన అన్నారు. నీట్ చుట్టూ జరుగుతున్నరాజకీయాలను మేము సరిదిద్దుతామని.. డీఎంకే దీన్ని రాజకీయం చేసిందని చెప్పుకొచ్చారు. విద్యార్థుల జీవితాలు ఏమైపోయినా వారికి పరవాలేదు. తమిళనాడు ప్రజలు దీన్ని మర్చిపోరు, బీజేపీ కూడా మర్చిపోదు. తమిళనాడులో పరీక్ష జరగదని చెప్పి పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులను నిలిపివేశారని విమర్శించారు. చివరి నిమిషంలో నీట్ జరుగుతుందని అంగీకరించారని.. దీని వల్ల విద్యార్థులు ఎంత గాయపడ్డారో ఊహించుకోండని అన్నామలై అన్నారు.

నీట్‌ పరీక్ష భయంతో పరీక్ష రాయడానికి కొన్ని గంటల ముందు ధనుష్‌ (20) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండుసార్లు నీట్​ రాసిన ఆ విద్యార్థి ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించకలేకపోతానేమో అన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జయలలిత అధికారంలో ఉన్నప్పుడు కూడా నీట్‌ పరీక్ష నిర్వహించలేదు. పళనిస్వామి సీఎం అయ్యాకే 2017లో తొలిసారి తమిళనాడు రాష్ట్రంలో నీట్‌ నిర్వహించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 + 4 =

Back to top button