తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆసుపత్రి పాలయ్యాడు. స్టాలిన్ కోవిడ్ సంబంధిత లక్షణాలతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంపై ఆసుపత్రి గురువారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణలో ఉండేందుకే ఆయన ఆస్పత్రిలో చేరారు.
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాక.. సీఎం స్టాలిన్ రెండు రోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. కరోనా లక్షణాలు ఎక్కువవడంతో ఆసుపత్రిలో చేరారనే ప్రచారం జరుగుతోంది. తాను కరోనా బారినపడినట్లు రెండు రోజుల క్రితం స్టాలిన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాస్త నీరసంగా అనిపించడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో స్టాలిన్ ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. 8,9 తేదీల్లో తిరువాన్నమలై జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో స్టాలిన్ మాస్క్ ధరించలేదు. ఈ క్రమంలోనే కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. గురువారం ఆయన ఆస్పత్రికి వెళ్లే సమయంలో పీపీఈ కిట్ ధరించారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. CT స్కాన్, ఇతర పరీక్షలు చేయించుకున్నారు.