More

    కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ పన్నాగాన్ని బయటపెట్టిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేత

    ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్నారు. వీరికి మద్దతుగా పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాదులు కొన్ని నెలల కిందటే ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్లారు. ఆఫ్ఘన్ ను తాలిబాన్లు ఆక్రమించుకోవడానికి ఐఎస్ఐ కూడా సహాయం చేసిందనేది బహిరంగ రహస్యమే..! పాకిస్తాన్ ప్రభుత్వం తాలిబాన్లకు కావాల్సిన ఆయుధాలను సరఫరా చేసింది. వారికి కావాల్సిన మద్దతును ఇచ్చింది. తాజాగా పాకిస్తాన్ పన్నాగం ఏమిటో ఆ దేశ రాజకీయ నాయకురాలి నోటి నుండే బయటకు వచ్చింది.

    పాక్ అధికార పార్టీ పాకిస్తాన్ టెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేత నీలం ఇర్షాద్ షేక్ లైవ్ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చేస్తున్న యాంటీ-ఇండియా అజెండాలో భాగంగా తాలిబాన్లకు పాకిస్తాన్ ప్రభుత్వ మద్దతు ఉందని స్పష్టంగా ప్రపంచానికి తెలుస్తోంది. ప్రస్తుతం తాము తాలిబాన్లకు మద్దతు ఇస్తున్నామని.. త్వరలో తాలిబాన్లు కశ్మీర్ విషయంలో తమకు సహాయం చేస్తారని పాక్ లో అధికారంలో ఉన్న పీటీఐ నేత నీలం ఇర్షాద్ షేక్ చెప్పుకొచ్చారు. కశ్మీర్ విషయంలో మనకు సాయం చేసేందుకు తాలిబన్లు సుముఖంగా ఉన్నారు’ అని ఆమె అన్నారు.

    ఈ మాటలు విన్న యాంకర్ ఆశ్చర్యపోయారు. ‘మేడమ్, మీరేమంటున్నారో మీకన్నా అర్థమవుతోందా? మీకర్థం కావడంలేదు. ఈ షో ప్రపంచం మొత్తం ప్రసారమవుతుంది. ఇండియాలో కూడా ఇది చూస్తారు.. మీకు తాలిబాన్లు వాట్సాప్ చేశారా మేము కశ్మీర్ విషయంలో సహాయం చేస్తామని.. ఇంతకూ ఎలా చెప్పగలుగుతున్నారు’ అని యాంకర్ ప్రశ్నించారు. కానీ ఆమె మాత్రం చెప్పుకుంటూనే వెళ్లిపోయారు. ‘తాలిబన్లు అవమానకరమైన ప్రవర్తన ఎదుర్కొన్నారని, అందుకే తమకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని స్పష్టంచేశారు.. తాలిబాన్లు తమతోనే ఉన్నారని.. కశ్మీర్ ను తమకు ఇప్పిస్తారని.. పాకిస్తాన్ తాలిబాన్లకు ఎంతగానో సహాయం చేసింది కాబట్టి.. కశ్మీర్ విషయంలో వాళ్లు కూడా తమకు సహాయం చేస్తారు’ ఆమె తెలిపింది. కాబూల్ ను సొంతం చేసుకున్నాక తాలిబాన్లు పలు అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో కశ్మీర్ సమస్య గురించి కూడా మాట్లాడిన తాలిబాన్లు.. అది భారత్ అంతర్గత, ద్వైపాక్షిక సమస్య అని స్పష్టంచేశారు. దానిలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పారు.

    Related Stories