International

భారత్ ను రిక్వెస్ట్ చేస్తున్న తాలిబాన్లు

ఆఫ్ఘ‌నిస్థాన్ ను తాలిబాన్లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే..! ఇక పరిపాలనపై దృష్టి పెట్టారు. అయితే ప్రపంచ దేశాలు మాత్రం తాలిబాన్లను నమ్మడం లేదు. తాజాగా తాలిబాన్లు భారత్ కు కొత్త రిక్వెస్ట్ పెట్టారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తాలిబాన్లు తొలిసారి భార‌త ప్ర‌భుత్వానికి అధికారికంగా ఓ లేఖ రాశారు. రెండు దేశాల మ‌ధ్య విమానాల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని ఆ లేఖ‌లో తాలిబాన్లు కోరారు. ద ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘ‌నిస్థాన్ పేరుతో ఈ లేఖ వ‌చ్చింది. డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్(డీజీసీఏ) అరుణ్ కుమార్‌కు తాలిబాన్లు ఈ లేఖ‌ను పంపించారు. ఆఫ్ఘ‌నిస్థాన్ పౌర విమానయాన శాఖ తాత్కాలిక మంత్రి అల్హాజ్ హ‌మీదుల్లా అకున్‌జ‌దా ఈ లేఖ‌ను సెప్టెంబ‌ర్ 7వ తేదీన రాశారు. మీకు తెలిసే ఉంటుంది ఈ మ‌ధ్య అమెరికా బ‌ల‌గాలు తిరిగి వెళ్లిపోయే స‌మ‌యంలో కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ను దెబ్బ‌తీశారు. అయితే ఖ‌తార్ సాంకేతిక సాయంతో ఎయిర్‌పోర్ట్‌ను పున‌రుద్ధ‌రించాము. ఈ మేర‌కు ఎయిర్‌మెన్‌కు నోటీసును ఈ నెల 6న జారీ చేశాము అని ఆ లేఖ‌లో హ‌మీదుల్లా రాశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని భారత్, ఆఫ్ఘ‌నిస్థాన్ మ‌ధ్య విమానాల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని కోరారు. మా అధికారిక ఎయిర్‌లైన్స్ అయిన అరియానా ఆఫ్ఘ‌న్ ఎయిర్‌లైన్‌, కామ్ ఎయిర్ త‌మ విమానాల‌ను తిరిగి ప్రారంభించాల‌ని అనుకుంటున్నామని.. వాణిజ్య విమానాలు వ‌చ్చేలా ఏర్పాట్లు చేయాల‌ని కోరుతున్నామని ఆ లేఖ‌లో హ‌మీదుల్లా కోరారు.

రెండు దేశాల మధ్య ప్రయాణాలు సజావుగా నిర్వహించాలని తాము కోరుకుంటూ ఉన్నామని.. ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇస్లామిక్ ఎమిరేట్ పౌర విమానయాన విభాగం దానికి అత్యున్నత హామీని ఇస్తుందని హ‌మీదుల్లా అన్నారు. ఆగస్టు 31 న దోహాలో సమావేశం జరిగినప్పటికీ ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలనను భారతదేశం అధికారికంగా గుర్తించలేదు. ఖతార్‌లోని భారత రాయబారి దీపక్ మిట్టల్, దోహాలోని తాలిబాన్ రాజకీయ కార్యాలయ అధిపతి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానెక్‌జాయ్‌ని కలిశారు. ఆగస్టు 30 న అమెరికా దళాలు ఉపసంహరించుకున్న తరువాత తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంది. తన పౌరులను తరలించడానికి భారతదేశం చివరిసారిగా ఆగస్టు 21 న కాబూల్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని నడిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 + 7 =

Back to top button