More

    కవి, చరిత్రకారుడిని చంపేసిన తాలిబాన్లు

    ఆఫ్ఘనిస్థాన్ లోని చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి తాలిబాన్లు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తాలిబాన్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలలో హింసకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. తాలిబాన్ల పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో హింసకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున బయట ప్రపంచానికి తెలుస్తూ ఉంది. తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలలో మరణశిక్షలు విధించబడుతూ ఉన్నాయి. పలువురు ప్రముఖులను కూడా తాలిబాన్లు చంపేస్తూ ఉన్నారు. తాజా నివేదికల ప్రకారం, ప్రముఖ ఆఫ్ఘనిస్థాన్ కవి మరియు చరిత్రకారుడు అబ్దుల్లా అతెఫీ తాలిబాన్ల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఆఫ్ఘన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం, ఈ సంఘటన దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉరుజ్‌గాన్ ప్రావిన్స్‌లో జరిగింది.

    ఆఫ్ఘన్ ఉపాధ్యక్షుడు అమరుల్లా సలేహ్ ఈ వార్తలను ధృవీకరించారు. అతెఫీని ఉరజ్‌గాన్ లోని చోరా జిల్లాలోని ఇంటి నుండి తాలిబాన్లు తీసుకెళ్లారని సలేహ్ పేర్కొన్నారు. తర్వాత అతడి తలపై కాల్పులు జరిగాయి. అతను ఆర్థిక శాస్త్రంలో దిట్ట అని, చరిత్రకారుడు కాబట్టి తాలిబాన్లు అతెఫీని చంపారని అమరుల్లా సలేహ్ అన్నారు. ఆఫ్ఘన్ మెదడుపై కూడా దాడి జరుగుతోంది. తెలివైన వాళ్ళను చంపి పాకిస్థాన్‌, తాలిబాన్లు కలిసి ఏమి లేనటువంటి భూమిని కోరుకుంటున్నారని విమర్శించారు. ఈ సంవత్సరం జూన్ నుండి అతెఫీ సొంత జిల్లా చోరా తాలిబాన్ నియంత్రణలోకి వెళ్ళిపోయింది. ఈ హత్యపై తాలిబాన్ ఇంకా స్పందించలేదు.

    ఈ ప్రాంతంలోని అనేక మంది ప్రముఖులు ఈ హత్యను ఖండించారు. అతెఫీ హత్య తాలిబాన్లు విద్య మరియు అవగాహనకు వ్యతిరేకం అని నిరూపిస్తుందని విమర్శించారు. అతెఫీ పష్టున్ యువకులకు విద్యాబోధన చేస్తున్నట్లు మరియు హింస నుండి వారి దారిని మళ్లించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది.

    అంతకుముందు నాజర్ మహ్మద్ అలియాస్ ఖాసా జ్వాన్ అనే ప్రముఖ హాస్యనటుడిని తాలిబాన్లు దారుణంగా చంపారు. బయటకు వచ్చిన వీడియోలలో, తాలిబాన్ ఉగ్రవాదులు అతనిని చంపడానికి ముందు దాడి చేశారు. జూలైలో రాయిటర్స్ ఫోటో జర్నలిస్ట్ డేనిష్ సిద్ధిఖీని కూడా తాలిబాన్లు చంపారు. అతను ‘ఎదురుకాల్పుల్లో చిక్కుకున్నాడు’ అని మీడియా ఈ సంఘటనను వైట్‌వాష్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ, తాలిబాన్లు అతడు భారతీయుడని తెలిసే దారుణంగా చంపినట్లు తరువాత తెలిసింది. బుల్లెట్ గాయం తర్వాత మసీదులో ఆశ్రయం పొందిన సిద్ధిఖిని బయటకు లాగి, అతడిని కాల్చి చంపారు.

    Trending Stories

    Related Stories