Sports

ఐపీఎల్ ప్రసారాన్ని ఆపేసిన తాలిబాన్లు.. కారణం ఏమి చెబుతున్నారంటే..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ప్రపంచం లోని ఎన్నో దేశాలలో ఈ క్రికెట్ టోర్నమెంట్ ను చూస్తూ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా టెలీకాస్ట్ చేస్తూ ఉండగా.. తాజాగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. తాలిబాన్లు అధికారం లోకి వచ్చాక ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఐపీఎల్ ను చూసే విషయంలో కూడా తాలిబాన్లు తాజాగా నిబంధనలను తీసుకుని వచ్చారు.

యూఏఈ వేదిక‌గా ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ మొద‌లైంది. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయితే.. ఐపీఎల్‌పై తాలిబాన్ల ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆ దేశంలో ఐపీఎల్‌ ప్రసారాలపై బ్యాన్ విధించింది. మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానుల్లో మహిళలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమ‌ని చెబుతోంది. ఐపీఎల్ కు సంబంధించిన ఎటువంటి ప్రత్యక్ష ప్రసారం ఉండకూడదని ఆఫ్ఘన్ మీడియాకు ఆదేశాలు జారీ చేసారు. ‘ఆఫ్ఘనిస్తాన్ లో ఐపీఎల్ ప్రసారాలపై తాలిబాన్లు నిషేదం విధించారు. ఐపీఎల్ జరుగుతున్న స్టేడియాల్లో మహిళా ప్రేక్షకులు ఉండటం, వారిలో పలువురు డ్యాన్స్ చేస్తున్నారనే కారణంతో మ్యాచ్‌లను ప్రసారం చేయొద్దని ఆఫ్ఘన్ మీడియా సంస్థలకు తాలిబాన్లు హెచ్చరికలు జారీ చేశారు’ అని జర్నలిస్టు ఫవాద్ అమన్ ట్వీట్ చేశారు. మరీ ఇలాంటి కారణాలను చెబుతూ తాలిబాన్లు నిషేధాలు విధిస్తూ వెళుతుండడంతో ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి. ఇప్పటికే మహిళల మీద ఎన్నో ఆంక్షలు విధిస్తూ వెళుతున్న తాలిబాన్లు.. సాధారణ ప్రజలకు కనీసం ఎంటర్టైన్మెంట్ లేకుండా చేస్తున్నారు.

Related Articles

Back to top button