International

రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని తాలిబాన్ ఆదేశాలు

కాబూల్ ను హస్తగతం చేసుకున్న కొన్ని గంటల్లోనే అతి కిరాతకమైన ఖైదీలను జైళ్ల నుండి విడుదల చేసిన తాలిబాన్లు.. ఇప్పుడు రాజకీయ ఖైదీలను కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. ఆఫ్ఘనిస్తాన్ లోని అన్ని జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని తాలిబాన్లు ఆర్డర్స్ ను విడుదల చేశారు. తాలిబాన్ చీఫ్ ముల్లా హిబతుల్లా అఖుంజాదా మాట్లాడుతూ, గవర్నర్లందరూ రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని వారందరూ కుటుంబాల దగ్గరకు వెళతారని చెప్పారు.

ఒక్కసారిగా అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ ను వీడడంతో తాలిబాన్లు ఇష్టా రాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారని పలు దేశాధినేతలు, ప్రముఖులు, రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. అమెరికా చేసిన పని ఆఫ్ఘన్ల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.

జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్‌మీర్ మాట్లాడుతూ ఆఫ్ఘన్ ప్రభుత్వం హఠాత్తుగా పతనం కావడం మరియు తాలిబాన్ వేగంగా స్వాధీనం చేసుకోవడం ఒక పశ్చిమ దేశాలకు సిగ్గుచేటు అని అన్నారు. కాబుల్‌ విమానాశ్రయంలో చోటుచేసుకున్న దృశ్యాలు పశ్చిమ దేశాలకు సిగ్గుచేటని, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల వశం కావడంతో అక్కడి ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు విమానాశ్రయాల వైపు పరుగులు తీస్తూ కాబుల్ విమానాశ్రయంలో వెలుగుచూసిన దృశ్యాలు పశ్చిమ దేశాలకు సిగ్గుచేటు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి.. మనం బాధ్యత తీసుకోవాల్సిన మానవ విషాదం. ఆ దేశంలో స్థిరమైన, ఆచరణీయమైన సమాజాన్ని నిర్మించేందుకు సంవత్సరాల తరబడి చేసిన ప్రయత్నం విఫలమైంది. దాంతో మన విదేశాంగ, సైనిక విధానంపై అనేక ప్రశ్నలు తలెత్తున్నాయని వాల్టర్ అభిప్రాయపడ్డారు.

ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు నాటకీయంగా, భయంకరంగా ఉన్నాయని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌ అన్నారు. స్వేచ్ఛా సమాజం కోసం పనిచేసిన వారికి, పాశ్చాత్య సమాజ మద్దతుతో ప్రజాస్వామ్యం, విద్య, మహిళల హక్కులపై దృష్టిసారించిన లక్షల మంది ఆఫ్ఘన్ లకు ఇది భయంకరమైన పరిణామమని మెర్కెల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో వైఫల్యం నుండి పాఠాలు నేర్చుకోవాలని ప్రపంచ దేశాలను ఆయన కోరారు.

ఆఫ్ఘనిస్తాన్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో “బాధ్యతాయుతమైన మరియు ఐక్య ప్రతిస్పందన” కోసం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పిలుపునిచ్చారు. తాలిబాన్లు తిరిగి అధికారాన్ని పొందడంతో.. ఆఫ్ఘనిస్తాన్ అస్థిరత కారణంగా ఐరోపాకు వలసలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మంగళవారం పార్లమెంటు లిస్టీ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెక్ ప్రెసిడెంట్ ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా వైదొలగడం, ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) యొక్క నాటకీయ వైఫల్యంగా అభివర్ణించాడు. స్వీడిష్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్ స్వీడిష్ టెలివిజన్‌తో మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకుంటున్న ఘటనలు తీవ్రంగా కలచి వేశాయని.. 20 ఏళ్ల పాటూ సైన్యాలు అక్కడే ఉండి చేసిన మేలేమిటో ఒకసారి ఆలోచించాలని అన్నారు. యుఎస్ ఉపసంహరణను క్షమించరానిది అని బిల్డ్ ఈ చర్యను ప్రశ్నించాడు. ఈ పని చేస్తే అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోయారని.. కనీసం తాలిబాన్ల చర్యలకు సిద్ధంగా కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు.

బెల్జియం వార్తాపత్రిక హెట్ లాట్స్‌టీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెల్జియంలోని ఆంట్‌వెర్ప్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ రాజకీయాల ప్రొఫెసర్ డేవిడ్ క్రిక్‌మ్యాన్స్ ఆఫ్ఘనిస్తాన్ నుండి యుఎస్ మిలిటరీ సైన్యాన్ని ఉపసంహరించేలా చేసి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఒక పెద్ద తప్పు చేశారని ఆరోపించారు. “అన్ని సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని అధ్యక్షుడు జో బిడెన్ తీసుకున్న నిర్ణయం ఈ శతాబ్దంలో పశ్చిమ దేశాల అతిపెద్ద వ్యూహాత్మక తప్పు” అని ఆయన అన్నారు.

బాధాకరమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేది ఎవరు..?

ఫ్రెంచ్ జాతీయ దినపత్రిక లే మోండే ఆఫ్ఘనిస్తాన్‌లో తప్పుల తర్వాత బాధాకరమైన ప్రశ్నల జాబితాను సిద్ధం చేసింది.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, 9/11 యొక్క 20 వ వార్షికోత్సవానికి ముందు ఆఫ్ఘనిస్తాన్ నుండి సైనిక ఉపసంహరణను చేయడం ద్వారా మరో తప్పును చేశారు. 2002 లో ఆఫ్ఘనిస్తాన్‌లో సైన్యాన్ని మోహరించడానికి పశ్చిమ దేశాలకు ఎటువంటి కారణం లేదు. తాలిబాన్ వ్యతిరేక శక్తులపై విజయం అని చెప్పుకున్నా.. ఏ దేశం కూడా శత్రువు లేని దేశాన్ని సైనికపరంగా ఆక్రమించదని తమ వార్తా పత్రికలో రాసుకొచ్చింది.

2001 చివరిలో ఉనికిలో లేని ఆఫ్ఘన్ అంతర్యుద్ధానికి ఆజ్యం పోసిన తాలిబాన్ పోరాటాన్ని తిరిగి ప్రారంభించడానికి కారణమైంది. ఇప్పుడు తాలిబాన్లు కాబూల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.. అధికారం చెలాయిస్తారు. అయితే బాధాకరమైన ప్రశ్నలు మాత్రమే మిగిలి ఉన్నాయి అని లే మోండే పేర్కొంది.

ఉపసంహరణను ప్లాన్ చేయడంలో విఫలమైనందుకు బిడెన్‌ను విమర్శించారు కాంగ్రెస్ సభ్యులు. ఇది ఒక విపత్తు.. జో బిడెన్ చేతులకు రక్తం అంటుకుందని విమర్శలు గుప్పించారు.

నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్‌టెన్‌బర్గ్ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్‌లో నాతొ దళాలు ఎంతగానో పోరాడాయి. రెండు దశాబ్దాలుగా మా నాటో దళాల త్యాగం ఉన్నప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ పతనం వేగంగా మరియు అకస్మాత్తుగా జరిగింది. నేర్చుకోవడానికి చాలా పాఠాలు ఉన్నాయని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

10 − 8 =

Back to top button