International

ఇంతకీ ఈ నెల రోజుల్లో తాలిబన్లు ఏం చేశారు. ?

తాలిబన్లు…అఫ్గానిస్తాన్ ను ఆక్రమించుకుని నెల రోజులు అయ్యింది. ఈ నెల రోజుల్లో పశ్చిమ దేశాల మీడియాతోపాటు మన దేశంలోని సోకాల్డ్ లెఫ్ట్ లుటియెన్స్ మీడియా, స్వయం ప్రకటిత మేధావులు, ఇంకా భారత వ్యతిరేక తుక్డే తుక్డే గ్యాంగులు తాలిబన్లు మారిపోయారంటూ చాలానే చెప్పారు.! ముందున్న తాలిబన్లకు… ఇప్పుడున్న తాలిబన్లకు చాలా తేడా ఉందని, తాలిబన్లు ఇప్పుడు ఉదారవాదులుగా మారిపోయారని, తాలిబన్ల విషయంలో ఒక్క షరియా లా తప్ప.. మిగతా అంతా ఒకేనని , పైగా ప్రెస్ కాన్ఫరెన్సుల్లో సైతం తాలిబన్లు ఇంగ్లీషులో సమాధానాలు ఇస్తున్నారని మురిసిపోయారు. తాలిబన్లు మారిపోయారు అనేందుకు ఇంకా ఏం నిదర్శనాలు కావాలంటూ ఊగిపోయారు. ఇక బీబీసీ కథనాలైతే తాలిబన్లు మారిపోయారంటూ అహో ఓహో అంటూ తన కథనాల ద్వారా వెనుకేసుకువచ్చే ప్రయత్నం చేసింది. నేషనల్ మీడియాలో వచ్చే వార్తలను కట్ పెస్ట్ చేసి బ్రేకింగులు…చర్చల మీద చర్చలు జరిపే తెలుగు కార్పొరేట్ మీడియా చానళ్లు కూడా ఇదే తరహాలోనే తమ కథనాలను వల్లేవేశాయి.
నిజానికి ఈ నెల రోజుల్లో తాలిబన్లు చెప్పింది ఒకటి.. చేసింది మరోకటి.! వారు చెప్పేదానికి.. చేసే దానికి అసలు పొంతన లేకుండా పోయింది. మీడియా మైకుల ముందు మాత్రం తాము మారిపోయినట్లుగా.. తమ నటన కౌశాలన్ని ప్రదర్శించారు. ఆదర్శాలు వల్లించారు. కానీ గ్రౌండ్ లెవల్ రియాలీ మాత్రం వేరుగా ఉందన్నది నిప్పులాంటి నిజం.!
ఇంతకీ ఈ నెల రోజుల్లో తాలిబన్లు ఏం చేశారు. ? అఫ్గాన్ మహిళలు సమాన హక్కులను కట్టబట్టేందు తాలిబన్లు సీరియస్ గా ఉన్నారా? అఫ్గాన్ బాలికలందరూ చదువుకునేందుకు తాలిబన్లు తమ అంగీకారం తెలిపారా? మానవ హక్కులను తాలిబన్లు గౌరవిస్తున్నారా? గత జులై నెల నుంచి అఫ్గాన్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా లేవు. అఫ్గాన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే సత్తా తాలిబన్లకు ఉందా? అయితే.. మరి… తాలిబన్ల ప్రకటించిన తాతాల్కిక ప్రభుత్వంలో బయటపడిన అంతర్గత కలహాలమాటేమిటీ? తాలిబన్లలో నంబర్ టు నేతగా ఉన్న ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కాబుల్ నుంచి అచానక్ గాయబ్ అవ్వడానికి కారణాలేంటి? అఫ్గాన్ లో ప్రభుత్వంలో హక్కానీ నెట్ వర్క్ కు కీలక పదువులు కట్టబెట్టాలని పాకిస్తాన్ ఎందుకు పట్టుబట్టింది? అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యాన్ని తాలిబన్లు సహించాల్సిందేనా? తమ దేశ సంపదను చైనా కంపెనీలకు కట్టబెట్టాల్సిందేనా?
వంటి విషయాలను మనం ఇప్పుడు చర్చించే ప్రయత్నం చేద్దాం.
..
అఫ్గాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేసి… మొత్తానికైతే తాలిబన్ టెర్రరిస్టులు అధికారాన్ని హస్తగతమైతే చేసుకున్నారు కానీ…! ఈ నెలరోజుల్లో తాము మారపోలేదని..తమలోని రాక్షసత్వం ఇంకా అలాగే ఉందని తమ చేతల ద్వారా నిరూపించారు తాలిబన్ ఉగ్రవాదులు.! తాలిబన్లలో ఇప్పుడు అధికారం కోసం అంతకలహాలు మొదలయ్యాయనే ప్రచారం కూడా జోరందుకుంది.
ఇటు..అఫ్గాన్ సామాన్య ప్రజానీకం ఆకలి కేకలతో కొట్టుమిట్టాడుతోంది. నెల క్రితం వరకు అంతా కూడా సవ్వంగా సాగిన అఫ్గాన్ లో.., తాలిబన్ ఇస్లామిక్ ఉగ్రవాదుల రాక మూలంగా అల్లోకల్లోలంగా మారిపోయింది. తినడానికి తిండలేక ప్రజలు అల్లాడే పరిస్థితులు దాపురించాయి. ఈ నెల ఆఖరి వరకు అఫ్గానిస్తాన్ లో ఆహార సంక్షోభం రాబోతుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 14 లక్షల మందికి తినేందుకు తిండి దొరకని పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికాతోపాటు మరికొన్ని దేశాలు ఖతర్ ద్వారా మానవత సాయాన్ని అఫ్గాన్ పౌరులకు అందిస్తున్నాయి.
దీనితోడుగా అఫ్గాన్ విదేశీ మారక నిల్వలు కూడా రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. బ్యాంకుల నుంచి ఇరవైవేల రూపాయలకు మించి విత్ డ్రా చేయకుండా ఆంక్షలు విధించారు. బ్యాంకుల ముందు కిలోమీటర్ల మీర క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. జనం కూడా తమ ఇంట్లోని వస్తువులను అమ్మకానికి పెడుతున్నారు. ప్రైవేటు సెక్టార్ లో పనిచేసేవారందూ తమ ఉపాధిని కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగులకు జులై నుంచి జీతాలు లేవు.!
తాము మారిపోయాయమని చెప్పిన తాలిబన్లు.. తమ అసలు రంగును క్రమంగా బయటపెట్టుకుంటున్నారు. ఈ నెల రోజుల్లో.. తాలిబన్లు చేయని అరాచకాలు లేవు. మహిళలపై కాల్పులు జరిపారు. కొరడాలతో కొట్టారు. మానవత్వం మంటగలిగే వారికి గుండ్లు కొట్టించారు. ఇలా అనేక ఘటనలు ఒకటి తర్వాత ఒకటి ఈ నెల రోజుల్లో అఫ్గాన్ లో దర్శనం ఇచ్చాయి. మహిళల హక్కుల పరిరక్షణపై తాలబన్లు ఇంతవరకు క్లారిటీగా ఒక్క హామీ కూడా ఇవ్వలేకపోయారు. దీంతో అఫ్గాన్ మహిళా పుట్ బాల్ టీమ్ సభ్యులతే తాలిబన్లకు భయపడి పాకిస్తాన్ లోనే ఉండిపోయారు. ప్రస్తుతం ఖతర్ ప్రభుత్వ సిబ్బంది పర్యవేక్షణలో అఫ్గాన్ లోని మూడు విమానశ్రయాల్లో అయితే విమాన రాకపోకలు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. తాలిబన్లు అధికారంలోకి
కాబుల్ తోపాటు అప్గాన్ లోని జైళ్లు అన్ని ఖాళీ అయ్యాయి. ఒకప్పుడు ఈ జైళ్లలో తాలిబన్లు ఖైదీలుగా ఉండేవారు. కానీ ఇప్పుడు వాళ్లే పాలకులు అయ్యారు. ఇక అఫ్గాన్ లో దారుణాలకు పాల్పడుతున్న తాలిబన్లను… ఇప్పుడు అదుపుచేసేది ఎవరు?
అధికారం సాధించి తర్వాత తాలిబన్ టెర్రరిస్టులు ప్రజల జీవితాల ఆటాడుకుంటున్నారు. అఫ్గానిస్తాన్ లో ఇన్నిదారుణాలు జరుగుతున్న ప్రపంచ దేశాలు మాత్రం చోద్యం చూస్తున్నాయి. అటు ఇదే అదనుగా అఫ్గాన్ లో కమ్యూనిస్టు గుంట నక్క చైనా…, ఉగ్రవాద దేశం పాకిస్తాన్ లు సాయం పేరుతో తిష్టవేశాయి. పాకిస్తానేమో..తన టెర్రర్ క్యాంపులను అఫ్గాన్ కు తరలించడంతోపాటు, శరణార్థుల పేరుతో అంతర్జాతీయ సాయం నొక్కేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వాన్ని నడిపేందుకే పైసలు లేని ఇమ్రాన్ ఖాన్ సర్కార్..అఫ్గాన్ శరణార్థులకు తమ దేశంలో కొంతకాలం ఆశ్రయం ఇవ్వడం వెనుక…ఆంతర్యం ఇదేనని కొంతమంది విశ్లేషకులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నరహంతక టెర్రర్ క్యాంపులను అధికారికంగానే నడిపే పాకిస్తాన్ కు అఫ్గాన్ పౌరులపై సడన్ గా ప్రేమ పుట్టుకుని రావడం ఏంటీని అని ప్రశ్నిస్తున్నారు. టెర్రరిస్టులకు నిధుల అందకుండా చర్యలు తీసుకుకోవడం.., పాకిస్తాన్… ఘోరంగా విఫలమైందని గుర్తించిన FATF .., ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ కు అప్పుపుట్టకుండా గ్రే లిస్టులో పెట్టిన విషయాన్ని మనం మర్చిపోరాదు.
ప్రపంచానికి టెర్రరిస్టులను ఎక్స్ పోర్టు చేసే దేశంగా ముద్రపడిన పాకిస్తాన్… మానవత దృక్పదం అంటూ మాట్లాడటం వెనుక.., అఫ్గాన్ శరణార్థులకు సాయం పేరుతో ప్రపంచ దేశాల నుంచి నిధులు రాబట్టడంతోపాటు, FATF గ్రేలిస్టు నుంచి సైతం బయటపడేందు వేసిన ఎత్తులో భాగమేనని.., కొంతమంది రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
అటు గుంటనక్క చైనానేమో…అఫ్గాన్ లోని అపార ఖనిజ సంపాదపై కన్నేసిందని… ప్రపంచ దేశాలన్ని కూడా వెయిట్ అండ్ సీ పాలసీని అవలంబిస్తుంటే.. చైనా మాత్రం తాలిబన్లకు ఆర్థిక సాయం ప్రకటించడం వెనుక అసలు కారణం ఇదేనని అంటున్నారు. వరల్డ్ ముస్లింలందరి రక్షణ తమదే బాధ్యత అన్నట్లుగా భావించే…, ఇస్లామిక్ దేశాలు.., ఇంకా పాకిస్తాన్ కానీ , ఇటు అప్గాన్ తాలిబన్లు కానీ , హక్కానీ టెర్రర్ మూకలు కానీ , ఐసిస్ కానీ.., అల్ ఖైదా కానీ…, జింజియాంగ్ ప్రావీన్స్ లోని.., వీగర్ ముస్లింల అణిచివేతకు పాల్పడుతున్న, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై మాత్రం ఈ ఇస్లామిక్ మతోన్మాద మూకలు మౌనం వహించడాన్ని ఏమనుకోవాలి?
తాలిబన్ల నెల రోజుల ఈ పాలన చూసిన తర్వాత ప్రపంచ దేశాలు.., తాలిబన్లతోపాటు పాకిస్తాన్ ను కూడా నమ్మాలంటే కూడా భయపడుతున్నాయన్నది నిజం.. తాము అందిస్తున్న మానవత సాయం కూడా ఖతర్ దేశం ద్వారానే అఫ్గాన్లకు చేరాలే చూస్తున్నాయి తప్పా.. పాకిస్తాన్ ద్వారా మాత్రం కాదు.!
మరోవైపు అనేక మల్లగుల్లాల అనంతరం ఏర్పాటైన తాలిబన్ ప్రభుత్వంపై తాలిబన్లలోని ఒక వర్గం అసంతృప్తితో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. హక్కానీ నెట్‌వర్క్ లోని శక్తిమంతమైన నాయకుడు ఖలీల్‌ ఉర్‌ రహ్మన్‌ హక్కానీ, ముల్లా బరాదర్‌ మధ్య వివాదం మొదలైందని తెలుస్తోంది..
తమ దౌత్యం వల్లే అమెరికన్లు అఫ్గాన్ ను వెళ్లిపోయారని బరాదర్‌ భావిస్తుండగా.. తాము యుద్ధం చేయడంతోనే అమెరికన్లు పలాయనం చిత్తగించారని హక్కానీ అనుచరులు వాదించారట.! ఈ క్రమంలోనే ఇరువురు నాయకులు పరస్పరం పెద్ద పెద్దగా అరుచుకొన్నారని , అదే సమయంలో పక్కన ఉన్న ఇరువర్గాల సభ్యలు ఒకరినొకరు తన్నుకొన్నారని, కొంతమంది గాయపడ్డారని.., ఈ విషయాన్ని తాలిబన్‌ సీనియర్‌ నాయకుడు, ప్రత్యక్ష సాక్షులు తమ వద్ద ధ్రువీకరించారని బీబీసీ పష్తో టీవీ కూడా తెలిపింది.
గత వారం చివరల్లో చోటు చేసుకున్న ఈ ఘటన తర్వాత మంత్రివర్గం కూర్పుపై అలిగిన బరాదర్ కాబుల్ వదిలి పెట్టి కాందాహార్ వచ్చాడని చెబుతున్నారు. కాందాహార్ లో ఉంటున్న తాలిబన్‌ సుప్రీం లీడర్‌ ముల్లా హబైతుల్లా అఖుంద్‌జాదాను కలిసిన బరాదర్ మంతివర్గ కూర్పుపై తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
పాకిస్తాన్ కు బరాదర్ అంటే భయం ఉందని, 2010లో బరాదర్ ను పాకిస్తాన్ ప్రభుత్వం అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసిందని..ఆ తర్వాత అమెరికా జోక్యంతో విడుదల చేసిన విషయాన్ని కొంతమంది గుర్తు చేస్తున్నారు. అఫ్గాన్ ప్రభుత్వంలో బరాదర్ కీలకమైన పదవిలో ఉంటే తమ దేశ ప్రయోజనాలు నెరవేరని భావించిన పాకిస్తాన్..ఐఎస్ఐ…, హక్కానీ వర్గాన్ని తెరపైకి తీసుకువచ్చిందని, ఆ వర్గం ద్వారా బరాదర్ పైనా దాడి చేయించిందనే ప్రచారం జరుగుతోంది. బరాదర్ చనిపోయాడని పుకార్లు పుట్టించడం వెనుక కూడా పాకిస్తాన్ ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దీంతో తాను చనిపోలేదని… బ్రతికే ఉన్నానని.. ప్రస్తుతం కాందర్ హార్ లో ఉన్నమాట నిజమేనని కెమెరా ముందుకు వచ్చి బరాదర్ ధృవీకరించాల్సి వచ్చింది.
మొత్తానికి ఇది ఈ నెల రోజుల్లో అప్గాన్ లో తాలిబన్ల పాలన తీరు.! దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను తప్పక తెలిజేయండి. మనసా వాచా కర్మణా దేశహితం కోసం పాటుపడండి.
భారత్ మాతాకీ జై.

Related Articles

Back to top button