More

  వస్త్రధారణ సరిగా లేదని.. మహిళను చంపేసిన తాలిబాన్లు

  ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు చేస్తున్న దారుణాలను చూస్తూ ఉంటే.. రాబోయే రోజుల్లో అక్కడ ఇంకెంత మారణహోమాన్ని సృష్టిస్తారోననే అనుమానాలు ప్రతి ఒక్కరికీ ఎదురవుతాయి. ఇప్పటికే తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో షరియా చట్టాలను అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలువురు నటులను, విద్యావేత్తలను చంపేశారు. తాలిబాన్లు చేస్తున్న అరాచకాలు బయటకు రాకుండా ఇప్పటికే జర్నలిస్టులను కూడా చంపేశారు. రేడియో-టీవీ స్టేషన్స్ ను కూడా వాళ్లు తమ ఆధీనంలోకి తీసేసుకున్నారు. ఇక సాధారణ ప్రజలపై కూడా తాలిబాన్లు షరియా చట్టాలను అమలు చేస్తూ ఉన్నారు.

  ఓ అమ్మాయి శరీరాన్ని అతుక్కుని వుండే దుస్తులు ధరించిందన్న ఆరోపణతో ఆమెను తాలిబ‌న్లు అత్యంత దారుణంగా చంపారు. ఆమె పేరు న‌జానిన్.. 21 సంవత్సరాల ఆమె బ‌య‌ట‌కు వెళ్తుండ‌గా తాలిబ‌న్లు చంపేశార‌ని పోలీసులు గుర్తించారు. మ‌హిళ‌లు ఎవ‌రూ ఉద్యోగాలు చేయ‌కూడ‌ద‌ని, ప‌ని కోసం బ‌య‌ట‌కు వెళ్ల‌కూడ‌ద‌ని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే బ‌య‌ట క‌న‌ప‌డుతున్న మ‌హిళ‌ల‌పై దారుణాల‌కు పాల్ప‌డుతున్నారు. న‌జావిన్‌ను తాము చంప‌లేద‌ని, పోలీసులు త‌మ‌పై కావాల‌నే ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని తాలిబ‌న్లు అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉత్తర బల్ఖ్ ప్రావిన్స్‌లో శరీరానికి అతుక్కుపోయిన బట్టలు ధరించినందుకు, మగ తోడు లేకుండా బయటకు వచ్చినందుకు మహిళను తాలిబాన్లు హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తాలిబాన్ నియంత్రణలో ఉన్న సమర్ ఖండ్ గ్రామంలో మహిళను కాల్చి చంపారని ఆఫ్ఘనిస్తాన్‌లో రేడియో ఆజాది నివేదిక పేర్కొంది. నజానిన్ తన ఇంటి నుండి వెళ్లి మజార్-ఇ-షరీఫ్ కోసం వాహనం ఎక్కబోతుండగా ఆమెపై దాడి జరిగింది.

  అమెరికా సైన్యం అధికారికంగా నిష్క్రమించడానికి ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు చాలా భూభాగాలను ఆక్రమించింది. ఆదివారం, తాలిబాన్లు ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని కుందుజ్ ప్రావిన్స్ రాజధానిలోని కొన్ని భాగాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నెలరోజులుగా ముట్టడించి చివరకు కుందుజ్ ప్రావిన్స్ ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్నారు. కుందుజ్ సిటీలోని ట్రాఫిక్ పోలీస్ బూత్ పై తమ జెండాను వీరు ఎగురవేశారు. తజికిస్తాన్ కి దగ్గరలోనే ఉన్న ఈ సిటీ సమీప గ్రామాల్లో పంటలు ఎక్కువగా పండిస్తుంటారు. ఈ సిటీలోని అతి పెద్ద జైలును కూడా తాలిబన్లు స్వాధీనం చేసుకుని అందులో ఖైదీలుగా ఉన్న దాదాపు 500 మంది తాలిబన్లను విడుదల చేశారు. గవర్నర్ కార్యాలయం, పోలీసు హెడ్ క్వార్ట్రర్స్ కూడా తమ వశమయ్యాయని తాలిబన్లు ప్రకటించుకున్నారు.

  శనివారం ఆఫ్ఘనిస్తాన్‌లోని పలు ప్రదేశాల్లో తాము జరిపిన వైమానిక దాడుల్లో 570 మంది తాలిబన్లు హతమయ్యారని ఆఫ్ఘనిస్తాన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరో 309 మంది తాలిబన్లకు గాయాలయ్యాలని తెలిపింది. పెద్ద మొత్తంలో ఆయుధాలను ధ్వంసం చేసుకున్నట్లు కూడా తెలిపింది. తాలిబన్లపై అమెరికా వైమానిక దళ సాయంతో ఈ దాడులు జరిపినట్లు ఆఫ్ఘనిస్తాన్‌ రక్షణ శాఖ పేర్కొంది. ప్రాంతాల వారీగా ఎంతమందిని మట్టుబెట్టిందీ ప్రకటించింది. తాలిబన్ల హెమ్‌ల్యాండ్‌ ప్రాంత అధిపతి మాల్వీ హిజ్రత్‌ కూడా మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్‌ అధికారులు తెలిపారు. వైమానిక దాడులకు సంబంధించిన వీడియోలను, చిత్రాలను సైతం విడుదల చేసింది.

  Trending Stories

  Related Stories