International

12 సంవత్సరాల వయసు పైబడిన బాలికలను లాక్కెళుతున్న తాలిబాన్లు.. ఎందుకంటే

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో కొత్త కొత్త నియమాలను, నిబంధనలను తాలిబాన్లు అమలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆడవారిపై కూడా తాలిబాన్ల దృష్టి పడింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న తాలిబాన్లు ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి బాలికలు, యువతులు అన్న తేడా లేకుండా లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నారు. రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదులు ఇప్పుడు 12 సంవత్సరాల వయస్సులో ఉన్న బాలికలను బలవంతంగా ‘పెళ్లి’ చేసుకోవడానికి, వారిని లైంగిక బానిసత్వంలోకి నెట్టడానికి ఇంటింటికీ తిరుగుతున్నారు.

డైలీ మెయిల్ నివేదిక ప్రకారం తాలిబాన్ కమాండర్లు, కొన్ని ప్రావిన్షియల్ రాజధానులను స్వాధీనం చేసుకున్న తర్వాత, తమ సైనికులు ‘ఖనిమాత్’ గా భావించి వివాహం చేసుకోవడానికి 12 నుండి 45 సంవత్సరాల వయస్సు గల అవివాహిత మహిళల జాబితాలను తీసుకురావాలని స్థానిక ఇమామ్‌లను ఆదేశించారు. తీసుకుని వచ్చిన మహిళలను పంచుకోవాల్సిందిగా తాలిబాన్లకు వారి హెడ్లు ఆదేశించారు. ఇది యుద్ధంలో గెలిచినందుకు బహుమానంగా భావించాలని సూచించారు. తాలిబాన్ కమాండర్ల ఆదేశాల మేరకు, తాలిబాన్ టెర్రరిస్టులు తమ ‘బహుమతులు’ పొందడానికి ప్రతి ఇంటికి వెళుతున్నారు. జిహాదీలు తమ లైంగిక బానిసలుగా బలవంతంగా లాగడానికి ముందు బాలికల వయస్సును ధృవీకరించడానికి ఆఫ్ఘనీల ఇళ్లలోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం.

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని తన నగరం తాలిబాన్‌ల చేతిలో పడిపోయిన తర్వాత తాను పారిపోవాల్సి వచ్చిందని ఒక మహిళా ఆఫ్ఘన్ జర్నలిస్ట్ తన బాధను వివరించింది. జిహాదీ గ్రూప్ యువతుల కోసం వెతికిందని, తాలిబన్లచే వేటాడబడతామో లేక ఉరితీయబడతామో అనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సి వస్తోందని ఆమె చెప్పింది.

మహిళలు చదువుకోవడం, ఉద్యోగం చేయడం నిషేధం

తాలిబాన్లు తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో కఠినమైన షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. స్థానిక కమాండర్ల నుండి అనుమతి లేకుండా మహిళలు పాఠశాలకు వెళ్లడం, ఉద్యోగాలు చేయడం, మగ తోడు లేకుండా ఇళ్లను వదిలి వెళ్లడాన్ని నిషేధించారు. గత నెలలో తాలిబాన్ ఉగ్రవాదులు ఇమామ్‌లు, గిరిజన పెద్దలకు 15 నుండి 45 సంవత్సరాల వయస్సు గల మహిళల లేదా వారి వితంతువుల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

తాలిబాన్లు తాము మానవ హక్కులను, ముఖ్యంగా మహిళల హక్కులను కాపాడతామని ప్రకటించాయి.. అయితే అవి “ఇస్లామిక్ విలువలు” ప్రకారం మాత్రమేనని తెలుస్తోంది. మహిళలకు కఠినమైన ఆదేశాలతో పాటు, ధూమపానంపై నిషేధం కూడా జారీ చేశారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్రంగా శిక్షించబడతారని హెచ్చరించారు.

Related Articles

One Comment

  1. Why Indian government is not taking any step to support Afghanistan government to eliminate Talibans? Now they are harrasing women ….how sad it it ….what these America, Russia…so called international countries are doing…Just seeing the show….shame full on this part

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − fourteen =

Back to top button