More

    తాలిబాన్ల ప్రెస్ కాన్ఫరెన్స్ వెనుక ఉన్న రియాలిటీ ఇదే..!

    తాలిబాన్లు తాము మారిపోయామని ప్రపంచానికి తెలియజేయడానికి చాలా ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు.మేము ‘మారారు’ అని ప్రపంచాన్ని ఒప్పించేందుకు తమ వంతు ప్రయత్నంగా తాలిబాన్లు ‘విలేకరుల సమావేశం’ నిర్వహించినప్పటికీ.. తాలిబాన్ యొక్క నిజస్వరూపం ఏమిటో ఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో, పట్టణాలలో బయటపడుతూ ఉంది.

    ఆఫ్ఘనిస్తాన్ జెండాకు అనుకూలంగా నిరసనలను కవర్ చేసినందుకు బుధవారం జలాలాబాద్‌లో జర్నలిస్టులపై తాలిబాన్లు దాడి చేశారు. తాలిబాన్ల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న ఇద్దరు జర్నలిస్టులు ఏడుస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బిబిసి వరల్డ్ సర్వీస్ జర్నలిస్ట్ హఫీజుల్లా మరూఫ్ షేర్ చేశారు.

    మరూఫ్ తన ట్విట్టర్ ఖాతాలో “జలాలాబాద్ నగరంలో జరిగిన నిరసనను కవర్ చేసినందుకు తాలిబాన్లు జర్నలిస్టులను కొట్టారు. జర్నలిస్టులు ఏడుస్తుంటే నిజంగా హృదయ విదారకంగా ఉంది. జర్నలిజం నేరం కాదు. ” అని చెప్పుకొచ్చారు.

    సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన మరొక వీడియోలో జలాలాబాద్ లో ఒక తాలిబాన్ వ్యక్తి నొప్పితో విలవిల్లాడుతున్న ఒక మహిళా జర్నలిస్ట్‌ ను తన్నడం, ఆమెపై నిలబడి ఉండటం కనిపించింది. సాయుధులైన తాలిబాన్లు మరొక జర్నలిస్ట్ ను అనేకసార్లు చెంపదెబ్బ కొట్టారు. విదేశీ మీడియాతో పనిచేసినందుకు ఇద్దరిని తాలిబన్లు శిక్షించారని సోషల్ మీడియా యూజర్లు తెలిపారు.

    నిరసనలు చేపట్టినందుకు నిరాయుధులను చంపిన తాలిబన్లు
    జలాలాబాద్‌లో ఆఫ్ఘన్ జాతీయులు ఆఫ్ఘన్ జెండాతో నిరసన ప్రదర్శనలను చేశారు. ఇది తాలిబాన్లకు అసలు నచ్చలేదు. ఆగ్రహానికి గురైన తాలిబాన్లు జనంపై కాల్పులు జరిపారు. నిరసనలకు వార్తా కవరేజ్ ఇచ్చినందుకు సంఘటన స్థలంలో ఉన్న జర్నలిస్టులను కొట్టారు. కాల్పుల్లో ముగ్గురు ఆఫ్ఘనియులు మరణించగా, మరో పది మంది గాయపడ్డారని వార్తలు వచ్చాయి.

    తాలిబాన్ల డబుల్ యాక్షన్:

    తాలిబాన్లు రెండు ముఖాల వ్యూహంతో వ్యవహరిస్తూ ఉన్నారు. తాము మారామని చెప్పుకుంటూ మహిళలు, పత్రికా హక్కులను గౌరవిస్తామని తాలిబాన్లు చెప్పారు. మరోవైపు ఇస్లామిక్ గ్రూపుకు వ్యతిరేకంగా స్వరం పెంచే మహిళలు, జర్నలిస్టులు, ఆఫ్ఘన్ జాతీయులపై దాడి చేస్తున్నారు.

    ప్రముఖ పాష్టో న్యూస్ యాంకర్ షబ్నం దావ్రాన్ ఆమె తన విధులను నిర్వర్తించడానికి వెళ్లినప్పుడు ఇంటికి తిరిగి పంపబడింది. ఆమె హిజాబ్ ధరించి మరియు ఆమె ఐడి కార్డ్ చూపించినప్పటికీ తాలిబాన్లు ఆమెను న్యూస్ కవరేజ్ చేయనివ్వలేదు. “పాలన మారిపోయింది. ఇంటికి వెళ్ళు” అని చెప్పినట్లు షబ్నం దావ్రాన్ చెప్పారు.

    Related Stories