International

సూసైడ్ బాంబర్ నెట్వర్క్ అధినేత కాస్తా ఇంటెలిజెన్స్ లో..!

తాజ్ మీర్ జవాద్.. తాలిబాన్ల సూసైడ్ బాంబర్ నెట్వర్క్ కు లీడర్ గా ఉండేవాడు. ఇప్పుడు అతడిని ఏకంగా ఇంటెలిజెన్స్ చీఫ్ డిప్యూటీ గా నియమించారు. తాలిబాన్ ఆత్మాహుతి దళాల నెట్‌వర్క్ నాయకుడు తాజ్ మీర్ జవాద్‌ కాస్తా ఇప్పుడు ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్దుల్ హక్ వాసిక్ వద్ద డిప్యూటీగా పనిచేయడానికి నియమించారు. తాజ్ మీర్ జవాద్ జీహాదీ గ్రూప్ వద్ద అంతర్గత సభ్యుడిగానూ, హక్కానీ నెట్‌వర్క్‌లో ఉన్నత స్థాయి ఆపరేటర్ ఉన్నాడు. ఈ బృందం ఆత్మాహుతి బాంబు దాడులకు ప్రసిద్ధి చెందింది. జూన్ 28, 2011 న కాబూల్‌లోని ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌పై తాజ్ మీర్ జవాద్ మరియు అతని ఆత్మాహుతి దళాలు దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కాబూల్ లో ‘కాబూల్ అటాక్ నెట్‌వర్క్’ అని పిలవబడే ఈ ఆత్మాహుతి దళాల నెట్‌వర్క్ వరుసగా దాడులకు పాల్పడింది

FDD యొక్క లాంగ్ వార్ జర్నల్‌లో బిల్ రోగ్గియో 2013 నివేదిక ప్రకారం, “కాబూల్ అటాక్ నెట్‌వర్క్ రాజధానిలో మరియు చుట్టుపక్కల ఉన్న వార్దక్, లోగర్, నంగర్‌హార్, లాగ్‌మ్యాన్, కపిసా, ఖోస్ట్, పక్తియా, పక్తికాలో పనిచేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా రాజధానిలో అనేక దాడులకు పాల్పడింది. అల్ ఖైదా, లష్కరే తోయిబా, ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, హిజ్బ్-ఇ-ఇస్లామీ గుల్బుద్దీన్ లు కూడా కాబూల్ అటాక్ నెట్‌వర్క్ తో చేతులు కలిపాయి” అని ఉంది. బిల్ రోగ్గియో నివేదికలో జవాద్ హక్కానీ నెట్‌వర్క్ మరో గ్రూప్ ను కూడా నడుపుతున్నారని ఉంది.

అబ్దుల్ రజిక్ అచక్జాయ్ అనే పోలీసు చీఫ్‌ని చంపిన బాంబర్‌కు శిక్షణ ఇచ్చాడు జవాద్. ఎంతో మంది ఆత్మాహుతి బాంబర్‌లకు శిక్షణ ఇచ్చే అల్-హంజా అమరవీరుల బ్రిగేడ్‌ని పర్యవేక్షించాడు జవాద్. హక్కానీ నెట్‌వర్క్ యొక్క మరొక సీనియర్ నాయకుడు సిరాజుద్దీన్ హక్కానీ ఆఫ్ఘనిస్తాన్‌లోని తాత్కాలిక తాలిబాన్ ప్రభుత్వంలో అంతర్గత మంత్రిగా నియమితులయ్యారు. అతను FBI మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. యుఎన్ ఉంచిన ఉగ్రవాదుల జాబితాలో ప్రస్తుత ప్రభుత్వంలో ఇంకా చాలా మంది ఉన్నారు.

ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోవడం పట్ల ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులకు స్వర్గధామంలా మారబోతోందని అంచనా వేస్తున్నారు. ఎన్నో తీవ్రవాద గ్రూపులకు తాలిబాన్లు ఆశ్రయం ఇస్తారని.. అక్కడి నుండే అటాక్ లు ప్లాన్ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు. వీటిపై తాలిబాన్ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి మొలావీ ఆమిర్‌ ఖాన్‌ ముత్తఖి స్పందించారు. అటువంటివేమీ జ‌ర‌గ‌బోవ‌ని.. త‌మ దేశాన్ని ఉగ్రశిబిరాలకు కేంద్రంగా మారనివ్వబోమని చెప్పారు. ఆఫ్ఘ‌న్‌లో మైనారిటీలు, మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తారా? అన్న విష‌యాల‌కు ఆయ‌న స్పందన లేదు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వ‌హిస్తారా? అన్న విష‌యంపై ఆయ‌న‌ను మీడియా ప్ర‌శ్నించింది. దీనిపై ఆయ‌న స్పందిస్తూ.. త‌మ‌ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు తలదూర్చాల్సిన అవసరం లేదని చెప్పేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 + 6 =

Back to top button