More

    తాజ్ మహల్ పేరును యోగి ఆదిత్యనాధ్ మార్చేయబోతున్నారా..?

    తాజాగా యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే.. సీఎం యోగి ఆదిత్యనాద్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

    యోగి ఆదిత్యనాద్.. సంచలానాత్మక నిర్ణయాలకు, కఠిన చట్టాల అమలులో పర్యవేక్షణకు కేరాఫ్ ఎడ్రస్.. చాలా మంది రాజకీయ పెద్దల మాటే ఇది. తాను ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యాక.. ఇచ్చిన ప్రతీ హామీనీ నెరవేర్చేందుకు నిత్యం కృషినల్పే దిశగా ఆయన అడుగులు ముందుకు పడుతుంటాయి. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగే అరుదైన వ్యక్తిత్యం యోగీ ఆదిత్యనాధ్ సొంతం.
    తాజాగా యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే.. సీఎం యోగి ఆదిత్యనాద్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
    తాజ్ మహల్ పేరు త్వరలో మారబోతోందని.. గతంలో తాజ్ మహల్ స్థానంలో శివాలయం ఉండేదని.. యోగి ఆదిత్యనాథ్ నేతృ.త్వంలోని యూపీ ప్రభుత్వం త్వరలోనే తాజ్ మహల్ పేరును రామ్ మహల్‌గా మార్చనుందని సంచలనానికి తెరలేపారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాజకీయంగానూ దుమారం రేపుతున్నాయి.
    బలియా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు సురేంద్ర సింగ్.
    అంతేకాదు యూపీ సీఎం యోగిని శివాజీ వారసుడని ప్రశంసలు కురిపించారు… ఆయన మాట్లాడుతూ ”ఉత్తరప్రదేశ్ గడ్డపై శివాజి వారసుడు అడుగుపెట్టాడు. సమర్థ్ గురు రాందాస్ ఎలాగైతే శివాజిని భారత్ కు ఇచ్చారో.. అలాగే గోరఖ్‌నాథ్ జీ కూడా యోగిని ఉత్తరప్రదేశ్‌కు ఇచ్చారు” అని ప్రశంసలు కురిపించారు.
    ఇక తాజ్ మహల్‌పై గత కొంత కాలంగా వివాదం నడుస్తోంది. తేజ్ మహల్ అసలు పేరు తేజో మహాలయ అని కొందరు బీజేపీ నేతలు వాదిస్తున్నారు. చరిత్ర కూడా ఇదే చెబుతోందని వెల్లడించారు. కానీ మొగల్ చక్రవర్తులు శివాలయాన్ని కూల్చివేసి.. అక్కడ సమాధిని కట్టారని గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్నారు. దానికే తాజ్ మహల్ అని పేరు పెట్టారని చెప్పారు. అందుకే తాజ్ మహల్ పేరును మార్చాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
    ఈ వాదనలు అలా ఉంచితే.. మన దేశంలో చాలా పురాతన కట్టడాలు ఇలానే విదేశీ దురాక్రమణ దారులతో కనుమరుగైపోయాయని… ఉన్నవాటికైనా వాటి అసలు పేర్లు పెట్టి.. వాటి సహజ స్వభావాన్ని కాపాడగలిగితే దేశ వారసత్వ సంపదను నిలబెట్టినవారమవుతామని చరిత్రకారులు, జాతీయవాదులు పదే పదే చెబుతున్న మాట.

    Trending Stories

    Related Stories