నెదర్లాండ్స్ తో తలపడనున్న భారత్.. లైవ్ టెలీకాస్ట్ డీటైల్స్

0
814

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆదివారం పాకిస్తాన్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసిన తర్వాత, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో గురువారం నెదర్లాండ్స్‌తో టీమిండియా తలపడనుంది. మేనేజ్‌మెంట్ ఏ ఆటగాడికీ విశ్రాంతి ఇవ్వడం లేదని, జట్టు సాధ్యమైనంత ఉత్తమమైన కలయికతో ఆడుతుందని స్పష్టం చేసింది. సూపర్ 12 దశలో నెదర్లాండ్స్ తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది.

ఇండియా vs నెదర్లాండ్స్.. సూపర్ 12 గ్రూప్ 2 మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్ లో ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయనున్నారు.. ఆన్ లైన్ లో చూడాలని అనుకున్నవాళ్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చూడొచ్చు.

భారత జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, దీపక్ హుడా , హర్షల్ పటేల్

నెదర్లాండ్స్ స్క్వాడ్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడే, కోలిన్ అకెర్‌మాన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), టిమ్ ప్రింగిల్, లోగాన్ వాన్ బీక్, షరీజ్ అహ్మద్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ టిమ్మ్ డెర్ మెర్వే, వాన్ డెర్ గుగ్టెన్, స్టీఫన్ మైబర్గ్, తేజ నిడమనూరు, బ్రాండన్ గ్లోవర్