More

  టీ20 ప్రపంచ కప్ ఫైనల్ నేడే..!

  టీ20 ప్రపంచ కప్ -2022 ఫైనల్ మ్యాచ్ లో ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభమవుతుంది. అదృష్టం కలిసి వచ్చి పాకిస్థాన్ జట్టు ఫైనల్ కు చేరింది. మంచి విజయాలను సాధిస్తూ ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ లో అడుగుపెట్టింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఫైనల్ మ్యాచ్ లో వర్షం వచ్చి మ్యాచ్ కు అంతరాయం ఏర్పడితే.. ఇరు జట్లు కనీసం 6-6 ఓవర్లు ఆడినప్పుడు డక్‌వర్త్-లూయిస్ నియమం వర్తిస్తుంది. మ్యాచ్ రోజు అంటే ఆదివారం వర్షం పడితే మరుసటి రోజు సోమవారం మ్యాచ్‌ నిర్వహిస్తారు. ఆ రోజు కూడా వర్షం పడి ఆట జరగక పోతే పాక్ – ఇంగ్లాండ్ జట్లు సంయుక్త విజేతగా నిలుస్తాయి.

  ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (w/c), అలెక్స్ హేల్స్, ఫిలిప్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, డేవిడ్ విల్లీ, టైమల్ మిల్స్, మార్క్ వుడ్ డేవిడ్ మలన్

  పాకిస్థాన్ జట్టు: మహ్మద్ రిజ్వాన్(w), బాబర్ ఆజం(c), మహ్మద్ హరీస్, షాన్ మసూద్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, హరీస్ రవూఫ్, షాహీన్ అఫ్రిది, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, హైద్ హస్నైన్ అలీ, ఆసిఫ్ అలీ

  టీవీలో ఇంగ్లాండ్ vs పాకిస్థాన్ ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌ లో చూడొచ్చు. ఆన్ లైన్, మొబైల్ వినియోగదారులు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

  Trending Stories

  Related Stories