Sports

టీ20 ప్రపంచ కప్.. భారత్-పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో..!

క్రికెట్ అభిమానులు టీ20 ప్రపంచ కప్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే వాయిదా పడిన టోర్నీని ఎలాగైనా నిర్వహించాలనే తాపత్రయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉంది. ముఖ్యంగా ఈ టీ20 ప్రపంచ కప్ ను నిర్వహించాల్సింది బీసీసీఐ. భారత్ లో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచ కప్ ను దుబాయ్, అబుదాబి, షార్జా, ఒమన్ లలో నిర్వహించనున్నారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి.

ఐసీసీ తాజాగా టోర్నీలో పాల్గొనే జట్లతో గ్రూపులను ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 20 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఆయా జట్ల స్థానాలను బట్టి వరల్డ్ కప్ గ్రూపుల్లో వాటికి చోటు కల్పించారు. టోర్నీ ప్రాథమిక దశ రెండు రౌండ్లలో సాగనుంది. ర్యాంకుల్లో టాప్-8 జట్లు నేరుగా రెండో రౌండ్ (సూపర్-12 దశ)లో ఆడతాయి. ఈ ఎనిమిది జట్లను గ్రూప్-1, గ్రూప్-2లో చేర్చారు. ర్యాంకింగ్స్ లో దిగువన ఉన్న జట్లను, అర్హత పోటీల ద్వారా టోర్నీలో ప్రవేశం పొందిన జట్లను గ్రూప్-ఏ, గ్రూప్-బిగా విభజించారు. తొలి రౌండ్ మ్యాచ్ లు ఆడి, ఆపై రెండో రౌండ్ (సూపర్-12)కు అర్హత సాధిస్తాయి. గ్రూప్-ఏ, గ్రూప్-బిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సూపర్-12 దశకు చేరతాయి. టాప్-8 జట్లతో కలిసి ఈ 4 చిన్న టీమ్ లు కూడా సెకండ్ రౌండ్ (సూపర్-12) ఆడతాయి. ఇక అతి త్వరలోనే టోర్నమెంట్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకటించనున్నారు.

తొలి రౌండ్
గ్రూప్-ఏ: శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా
గ్రూప్-బి: బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా, ఒమన్

సెకండ్ రౌండ్ (సూపర్-12)…
గ్రూప్-1: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, గ్రూప్-ఏ విన్నర్, గ్రూప్-బి రన్నరప్.
గ్రూప్-2: ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, గ్రూప్-బి విన్నర్, గ్రూప్-ఏ రన్నరప్.

శ్రీలంక మరియు బంగ్లాదేశ్ రెండూ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ఆడవలసి ఉంటుంది. గ్రూప్ ఏ లో ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియాతో శ్రీలంక స్థానం సంపాదించగా, గ్రూప్ బిలో బంగ్లాదేశ్ స్కాట్లాండ్, పపువా న్యూ గినియా, ఒమన్లతో తలపడనుంది. చిన్న టీమ్స్ అని తక్కువగా అంచనా వేస్తే శ్రీలంక, బంగ్లాదేశ్ లు రెండో రౌండ్ లోకి కూడా రాకుండా పోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

ఐసిసి యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అలార్డైస్ మాట్లాడుతూ “ఐసిసి పురుషుల టి 20 ప్రపంచ కప్ 2021 కోసం గ్రూప్ లను ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. గ్రూప్ మ్యాచ్ లలో కొన్ని గొప్ప మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ టోర్నమెంట్ ద్వారా అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నామని. కరోనా మహమ్మారి మొదలైన తర్వాత పలు దేశాలు కలిసి ఆడబోయే టోర్నీని ఐసీసీ నిర్వహిస్తుండడం ఆనందంగా ఉందని.. టోర్నీ సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ ఉన్నాము” అని అన్నారు.

ఈ టోర్నమెంట్ అక్టోబర్ 17 న ప్రారంభమవుతుంది. ఫైనల్ నవంబర్ 14 న జరుగుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం, షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్.. ఈ నాలుగు వేదికలలో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌ల తేదీలు త్వరలో ప్రకటించబడతాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 + one =

Back to top button