More

    ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు.. శ్రీరామనవమి వేడుకల్లో ఆయన ప్రసంగం వివాదాస్పదం..!

    ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదయింది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా రాజాసింగ్ చేసిన ప్రసంగం వివాదాస్పదంగా ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. రాజాసింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలతో జైలు జీవితం గడిపి వచ్చారు. న్యాయస్థానం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని తెలిపింది. న్యాయస్థానం విధించిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని పోలీసులు అంటున్నారు. శోభాయాత్రలో రాజాసింగ్ చేసిన ప్రసంగంపై ఎస్సై వీరబాబు అభ్యంతరం తెలిపారు. తన కొడుకుని పరిచయం చేస్తూ ఇతర కమ్యూనిటీలపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్యేపై ఎస్సై వీర బాబు ఫిర్యాదు చేశారు. దీంతో రాజా‌సింగ్‌పై 153-ఏ, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు.

    కొద్దిరోజుల కిందట ముంబైలో కూడా రాజా సింగ్ పై కేసు నమోదైంది. 2023, జనవరి 29న ముంబైలో జరిగిన బహిరంగ సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజాసింగ్‌పై ఐపీసీ సెక్షన్ 153 ఏ 1(ఏ) కింద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే వ్యాఖ్యలపై రాజాసింగ్‌కు హైదరాబాద్ పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారు. పోలీసులు నోటీసులు జారీ చేయడంపై రాజాసింగ్ స్పందిస్తూ ధర్మం కోసం అవసరమైతే జైలుకు వెళ్తానని అన్నారు.

    Trending Stories

    Related Stories