పాకిస్థాన్ మాజీ స్పైమాస్టర్, జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ మంగళవారం దేశ కొత్త ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. జనరల్ కమర్ జావేద్ బజ్వా స్థానంలో ఆయన బాధ్యతల చేపట్టారు. ఆర్మీ స్టాఫ్‌కి 17వ చీఫ్‌గా జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ మునీర్ బాధ్యతలు స్వీకరించారు. 61ఏళ్ల బజ్వా పదవీకాలాన్ని ఇప్పటికే మూడేళ్లు పొడిగించారు.