బుర్ఖాపై స్విట్జర్లాండ్ పార్లమెంట్ సంచలన నిర్ణయం..!

0
133

బుర్ఖాపై స్విట్జర్లాండ్ పార్లమెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. బుర్ఖాను నిషేధిస్తూ తీసుకుని వచ్చిన బిల్లుకు ఆమోదం పలికింది. ఈ బిల్లు ప్రకారం స్విట్జర్లాండ్ లో బురఖా ధరిస్తే భారీ జరిమానా విధించనున్నారు. బుర్ఖాలను నిషేధించే బిల్లుకు పార్లమెంటు దిగువ సభ నేషనల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కొంతమంది ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాతో పాటు ఇంకేదైనా వస్త్రంతో కానీ ముఖాన్ని కప్పివేయడం ఇకపై నేరంగా పరిగణించనున్నారు. ఇప్పటికే ఎగువ సభ ఆమోదించిన ఈ చట్టానికి దిగువసభ కూడా ఆమోదం తెలిపింది. 151-29 ఓట్లతో బుర్ఖా నిషేధంపై మద్దతు లభించింది. అయితే స్విట్జర్లాండ్ ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు.. రెండేళ్ళ క్రితమే దేశంలో ప్రజాభిప్రాయాన్ని స్వీకరించింది. దేశ వ్యాప్తంగా ప్రజలు బుర్ఖా ధరించటానికి వ్యతిరేకంగానే ఓటు వేశారు. 51% మంది నిఖాబ్‌లు, బుర్ఖాలు, స్కీ మాస్క్‌లు, బందన్నాలపై నిషేధం విధించడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. దిగువ సభ ఆమోదంతో నిషేధం ఇప్పుడు చట్టంగా మారింది.

ఈ నియమాలను ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానా విధించనున్నారు. ఈ రూల్స్ ను అతిక్రమిస్తే గరిష్టంగా 1,000 స్విస్ ఫ్రాంక్‌లు విధించనున్నారు. మన కరెన్సీలో రూ. 91,300 వరుకు జరిమానా విధిస్తారు. అయితే కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు తెలుస్తోంది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇస్లామిక్ సెంట్రల్ కౌన్సిల్ ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్‌ల వ్యాప్తికి కారణమవుతుందని ఆరోపించింది.

బహిరంగ ప్రదేశాల్లో మహిళలు బుర్ఖా ధరించడాన్ని ఇప్పటికే నిషేధించిన దేశాల జాబితాలో ఫ్రాన్స్, చైనా, బెల్జియం, డెన్మార్క్, శ్రీలంక, జర్మనీ, ఆస్ట్రియా, బల్గేరియా, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్
కాంగో రిపబ్లిక్ దేశాలున్నాయి.