More

    స్విగ్గీ డెలివరీ బాయ్ పై 20 మంది దాడి.. అసలేం జరిగిందంటే !

    స్విగ్గీ డెలివరీ బాయ్ పై దారుణం జరిగింది. అతని తప్పేం లేకపోయినా ఓ హెటల్ సిబ్బంది 20 మంది కలిసి రాడ్లు, కర్రలతో డెలివరీ బాయ్ పై దాడి చేశారు. విషయం తెలిసిన పోలీసులు గాయపడిన డెలివరీ బాయ్ ను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ చాలానే ఉన్నా.. స్విగ్గీ, జొమాటో లకే డిమాండ్ ఎక్కువ. అలా స్విగ్గీలో పనిచేస్తున్న ఓ బాయ్ కి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ తీసుకోవాల్సిన హోటల్ గచ్చిబౌలిలో ఉండగా.. అక్కడికి వెళ్లాడు. అరగంటకు పైగానే హోటల్ వద్ద ఆర్డర్ కోసం వేచి చూసినా.. ఆ హోటల్ సిబ్బంది ఇవ్వలేదు.

    ఆర్డర్ ఎందుకు లేటైందని అడగటంతో.. స్విగ్గీ డెలివరీ బాయ్ పై హోటల్ నిర్వాహకులు అతి కిరాతకంగా దాడి చేశారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 20 మంది సిబ్బంది రాడ్లు, కర్రలతో డెలివరీ బాయ్ మీద విరుచుకుపడ్డారు. హోటల్ యజమాని సహా అక్కడ పనిచేసే సిబ్బంది ఆ డెలివరీ బాయ్‌ని చితకబాదారు. అడ్డుకోడానికి వెళ్లిన డెలివరీ బాయ్స్‌ను కూడా కొట్టారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. హోటల్ యాజమాన్యం తమపై దౌర్జన్యంగా ప్రవర్తించిందని బాధితుడు, స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని.. ఆ ఘర్షణను ఆపారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన డెలివరీబాయ్ ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. స్విగ్గీ డెలివరీ బాయ్ పై దాడికి నిరసనగా.. స్విగ్గీ డెలివరీ బాయ్స్ అంతా హోటల్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేయగా.. ఆ హోటల్ యజమానిపై కేసు నమోదు చేశామని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు సర్దిచెప్పారు.

    Trending Stories

    Related Stories