More

    ఎట్టకేలకు ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేత

    ఎట్టకేలకు ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేసింది. సర్వీసులోకి తిరిగి తీసుకుంటూ ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ జగన్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి ఆయన సర్వీసును రీ ఇన్‌స్టేట్‌ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. జీఏడీకి రిపోర్టు చేయాలని ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉంటూ అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఏబీ వెంటకటేశ్వరరావును వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా ఏబీ వెంకటేశ్వరరావు కోర్టు మెట్లు ఎక్కారు.

    అంతకు ముందు ఏపీ మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. వెంటనే సర్వీసులోకి తీసుకోవాలంటూ జగన్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ఉత్తర్వులే అమలవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫిబ్రవరి 7వ తేదీతో వెంకటేశ్వరరావు రెండేళ్ల సస్పెన్షన్‌ ముగిసినట్టేనని, ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ఆయనకు ఇవ్వాల్సిన జీతభత్యాలను చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

    Trending Stories

    Related Stories