ఆర్య సమాజ్ మ్యారేజ్ సర్టిఫికెట్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

0
776

ఆర్య స‌మాజ్‌లో జ‌రిగే పెళ్లిళ్లు, మ్యారేజ్ సర్టిఫికెట్లపై సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్యలు చేసింది. ఆర్య స‌మాజ్‌లో జ‌రిగే పెళ్లిళ్లు ఆ సంస్థ ఇస్తున్న స‌ర్టిఫికెట్ల‌ను గుర్తించ‌బోమ‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆర్య స‌మాజ్ ఉన్న‌ది పెళ్లిళ్లు చేయ‌డానికి కాద‌ని.. ఇక‌పై ఆర్య స‌మాజ్ ఇచ్చే వివాహ స‌ర్టిఫికెట్ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోబోమ‌ని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆర్యసమాజ్ జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రానికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఆర్యసమాజ్ పని, అధికార పరిధి వివాహ ధృవీకరణ పత్రాలను జారీ చేయడం కాదని న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. సమర్థవంతమైన అధికారులు మాత్రమే వివాహ ధృవీకరణ పత్రాలను జారీ చేయగలరని ధర్మాసనం పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో ప్రేమ వివాహానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.