More

  సుప్రీం కోర్టు ఊహించని ప్రశ్నలకు షాకైన రాజకీయ పార్టీలు.. ఆన్సర్ తెలిసినా సైలెంట్ మోడ్ లోనే.. కారణం.. టాపిక్ అంత సెన్సిటివ్ మరి..!

  రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయాలు లేవా, వాటిని ఎంతకాలం కొనసాగించాలన్న రెండు మౌలిక అంశాలపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు పార్టీలు, ప్రభుత్వాలు సమాధానం చెప్పలేని దయనీయ పరిస్ధితుల్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకు ఎంత మంది సమాధానం ఇస్తారో తెలియని పరిస్ధితి.

  అంబేడ్కర్.. భారత రాజ్యాంగ నిర్మాతలలో ఒకరు. బడుగు బలహీన వర్గాలకు స్ఫూర్తి ప్రధాత. అటువంటి మహనీయుడి పేరు వాడుకునేవారు నేడు ఎక్కువయ్యారు. ఆయన చెప్పిన సూత్రాలు పాటించిన వారు కరువయ్యారు. అంతెందుకు భారత రాజ్యాంగాన్ని సైతం విస్మరిస్తూ.. ఓట్ల కోసం దిగజారిపోయినట్టుంది ప్రస్తుత వ్యవస్థ. ఇప్పుడు ఈ మాటలు చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి వ్యాఖ్యానిస్తున్నాను. సుప్రీం కోర్టు లో రిజర్వేషన్లపై జరుగుతున్న విచారణ సందర్భంగా ధర్మాసనం సంధించిన పలు ప్రశ్నలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

  దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. అన్నింటికంటే మించి రిజర్వేషన్ల మౌలిక స్వభావం, వాటిని కొనసాగించాల్సిన అవసరంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం లేవనెత్తుతున్న అభిప్రాయాలు రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల్లో గుబులు రేపుతున్నాయి. ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో తెలియక అంతా మౌనాన్నే ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఇటీవల జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. రిజర్వేషన్లకు బదులుగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యామ్నాయ మార్గాల్లో మేలు చేయగలమా లేదా అన్న అంశంపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్‌ కల్పిస్తూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఈ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

  ఈ కేసు విచారిస్తున్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రిజర్వేషన్ల వ్యవహారంపై మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా రోజుకో ప్రశ్న సంధిస్తోంది. దీంతో సుప్రీంకోర్టు సంధిస్తున్న ప్రశ్నలకు ఎలా స్పదించాలో తెలియక ప్రభుత్వాలు తలపట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయాలు లేవా, వాటిని ఎంతకాలం కొనసాగించాలన్న రెండు మౌలిక అంశాలపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు పార్టీలు, ప్రభుత్వాలు సమాధానం చెప్పలేని దయనీయ పరిస్ధితుల్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకు ఎంత మంది సమాధానం ఇస్తారో తెలియని పరిస్ధితి.

  నిజానికి దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లకే పరిమితం కాకుండా మరిన్ని చర్యలు తీసుకోవచ్చని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఆయా వర్గాల్లో విద్యను ప్రోత్సహించడం, విద్యాసంస్ధలు నెలకొల్పడం వంటివి చేయొచ్చని సూచించింది. దీనిపై జార్ఖండ్‌, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. రిజర్వేషన్లకు బదులుగా విద్యాసంస్ధలు పెంచడం, ఇతర కార్యక్రమాలు చేపట్టడం వంటివి ఆయా రాష్ట్రాల ఆర్ధిక పరిస్ధితులు, జనాభా, ఇతర అంశాలతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. రిజర్వేషన్లు ఎన్నో పోరాటాల తర్వాత వారికి లభించాయని కూడా తెలిపారు.

  రాష్ట్రాల్లో సామాజిక, విద్యా రంగాల్లో వెనుకబాటు కారణంగా రిజర్వేషన్లు కల్పిస్తున్న చెప్తున్న ప్రభుత్వాలు… ఇప్పుడు సుప్రీంకోర్టు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పరిస్ధితుల్లో కనిపించడం లేదు. సుప్రీంకోర్టు ప్రశ్నలపై చర్చ మొదలుపెడితే రిజర్వేషన్లకు వ్యతిరేకమన్న ప్రచారం మొదలవుతుందని, ఇది అంతిమంగా తమ పుట్టి ముంచుతుందని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. అదే సమయంలో ఇప్పటికే రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్న ఆరోపణను తెరపైకి తెచ్చారు. దీంతో యాజ్ యూజువల్ దీనిపై రాజరకీయ వివాదం కూడా నడిచే అవకాశం ఉంది.

  మన రాజ్యాంగ నిర్మాతలలో ఒకరైన శ్రీ బీం రావ్ రామ్ జీ అంబేడ్కర్ నిజానికి రిజర్వేషన్ లు ఉండాలి అని ప్రతిపాదించింది బడుగు బలహీన వర్గాలకు మేలు కలగాలని.. రక్షణ నెలకొనాలని. ఇక్కడ ఏం జరుగోంది అంతటా రాజకీయం తప్ప అనేది విశ్లేషకుల వాదన. రాజ్యాంగ నిర్మాత చెప్పిన మాట వినం… ఆయన ఆదర్శాలను పాటించం కానీ ఆయన పేరు వాడుకుంటాం.. ఓట్లు దండుకుంటాం.. అక్రమంగా విదేశీ నిధులు పోగేసుకుంటాం.. మత మార్పిళ్లు చేస్తాం అన్నట్లు వుంది ప్రస్తుతి సమాజ దుస్థితి. ఇది ఒక్క రాజకీయ రంగంలోనేకాదు.. అన్నింటా ఇదే ధోరణి. ఈ నేపథ్యంలో ధర్మాసనం ప్రశ్నలకు రాష్ట్రప్రభుత్వాలు సీరియస్ గా ఏమైనా సమాధానం ఇస్తాయా లేక మౌనాన్ని ఆశ్రయిస్తాయా అనేది వేచి చూడాల్సిందే.

  Trending Stories

  Related Stories