ఫేక్ చెకర్ జుబేర్ కేసులపై సుప్రీం సంచలన తీర్పు..!

0
871

కొన్ని కొన్ని సార్లు న్యాయస్థానాల తీర్పులు ఆశ్చర్యకరంగానూ, సంచలనాలకు కేరాఫ్ గా ఉంటున్నాయి. ముఖ్యంగా అత్యున్నత న్యాయస్థానాలు సైతం ఇలాంటి తీర్పులు వెలువరించి తరుచూ వార్తల్లో నిలుస్తున్నాయి.

వివాదాస్పద వ్యక్తులకు సైతం అనుకూల తీర్పులు రావడం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. అలాంటి తీర్పు ఒకటి సుప్రీంకోర్టు వెలువరించింది. ఫ్యాక్ట్ చెకర్ పేరుతో ఓ మతంపై దాడులకు ముస్లిం వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టిన ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రస్తుతం ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌లపై మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే భవిష్యత్‌లో నమోదయ్యే కేసుల్లోనూ అరెస్టు చేయకుండా కోర్టు ఊరటనిచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌కు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ బోపన్న ధర్మాసనం బదిలీ చేసింది.

జుబైర్ ట్వీట్లపై దర్యాప్తు చేసేందుకు ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి జుబైర్‌పై ప్రస్తుతం నమోదైన కేసులతో పాటు భవిష్యత్‌లో నమోదయ్యే ఎఫ్ఐఆర్‌లు సైతం ఢిల్లీకి బదిలీ అవుతాయని స్పష్టం చేసింది. కోర్టు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయనప్పటికీ.. తనపై ఉన్ని అన్ని కేసులను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించేందుకు జుబైర్‌కు అవకాశం కల్పించింది. ఎట్టకేలకు కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జుబైర్‌ జైలు నుంచి విడుదలకానున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

17 + 7 =