ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు మరో ఎదురు దెబ్బ

0
695

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెడటానికి ప్రయత్నిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చుక్కెదురైంది. రుషికొండ కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రతి ఇంచు స్థలానికి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలా అని ప్రశ్నించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోబోమని.. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకూ వేచి చూడాలని పిటిషనర్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది. రుషికొండలో రెండు కిలోమీటర్ల వరకు తవ్వకాలు జరిపారని సుప్రీంకోర్టుకు రఘురామకృష్ణరాజు న్యాయవాది ఫోటోలు ఇచ్చారు.. జోక్యం చేసుకునేందుకు అత్యున్నత స్యాయస్థానం ఆసక్తి చూపలేదు.