More

    విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు శిక్ష ఖరారు చేసేది ఆరోజే

    విజయ్ మాల్యా సుమారు రూ.9,000 కోట్ల మేరకు బ్యాంకు రుణాలను తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. ఆయన ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్నాడు. అతడిని భారత్ కు రప్పించడానికి భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే విజయ్ మాల్యా తిరిగి భారత దేశం రావడం కోసం ఇక వేచి చూడలేమని సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టు ధిక్కారం కేసులో ఆయనకు విధించదగిన శిక్షను వచ్చే ఏడాది జనవరి 18న నిర్ణయిస్తామని తెలిపింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఆయన తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు బదిలీ చేయడంతో ఆయన కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. బ్రిటన్ నుంచి మాల్యాను భారత దేశానికి రప్పించే ప్రక్రియ చివరి దశలో ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కొన్ని రహస్య కార్యకలాపాలు బ్రిటన్‌లో పెండింగ్‌లో ఉన్నాయని, వాటి వివరాలు తెలియవని చెప్పింది.

    ఆయన కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు 2017 మే నెలలో రుజువైందని, శిక్షను విధించడం మాత్రమే పెండింగ్‌లో ఉందని ధర్మాసనం తెలిపింది. భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వినిపించిన వాదనలలో, మాల్యాను భారత దేశానికి అప్పగించాలని బ్రిటన్‌లోని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని, అయితే ఈ తీర్పును అమలు చేయడం లేదని తెలిపింది. భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం విజ్ఞప్తి మేరకు మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు 2017 మే నెలలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

    Trending Stories

    Related Stories