More

    టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

    తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో అరెస్టైన నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం సుప్రీంకోర్లులో విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన బెంచ్ ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి ఉంటే, ఈ రోజే బెయిల్ ఇచ్చేవారమని.. అయితే నిందితులు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయలేదని పేర్కొంది. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు ఇలాంటి భిన్నమైన తీర్పులు ఎలా ఇస్తుందని కూడా ప్రశ్నించింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టుకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తాము యత్నించామంటూ అసత్య ఆరోపణలను ఆధారం చేసుకుని తెలంగాణ హైకోర్టు తమను రిమాండ్ కు పంపాలని ఆదేశాలు జారీ చేసిందని, హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఈ కేసులో అరెస్టైన రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ పోలీసులు పక్షపాత వైఖరితో తమపై కేసు పెట్టారని పిటిషనర్లు వాదించారు.

    Trending Stories

    Related Stories