సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధితో కృష్ణ బాధపడుతున్నారని తెలుస్తోంది. చికిత్స నిమిత్తం సూపర్ స్టార్ కృష్ణను హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చేర్చారు. కృష్ణ ఆరోగ్యం బాగానే ఉందని సీనియర్ నటుడు నరేష్ అన్నారు. శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేర్చామన్నారు. 24 గంటల తర్వాత హస్పిటల్ నుండి ఆయనను డిశ్చార్జీ చేస్తామని వైద్యులు చెప్పినట్లు నరేష్ మీడియాకు చెప్పారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు కృష్ఱ.. భార్య ఇందిరాదేవి ఇటీవలే కన్నుమూశారు. తాజాగా అనారోగ్యం పాలయ్యారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని తెలుస్తోంది.