సిద్ధులు, యోగుల్లో ఉండే ప్రశాంతతలో నా వద్ద 10 శాతం కూడా లేదు: రజనీకాంత్

0
755

సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో నిర్వహించిన ఓ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిమాలయాలను చాలామంది మామూలు మంచు కొండలు అనుకుంటారని, కానీ అవి అద్భుతమైన వనమూలికలకు నెలవు అని అన్నారు. అక్కడ లభించే కొన్ని మూలికలను తింటే వారం రోజులకు సరిపడా శక్తి లభిస్తుందని.. మానవ జీవితంలో ఆరోగ్యానిదే ప్రముఖ స్థానం అని రజనీకాంత్ స్పష్టం చేశారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మనవాళ్లు సంతోషంగా ఉంటారని.. మనం అనారోగ్యంతో ఉంటే మనకు కావాల్సిన వాళ్లు ఆనందంగా ఉండలేరని చెప్పుకొచ్చారు. డబ్బు, పేరు, ప్రతిష్ఠలు తనకు కొత్త కాదని.. తాను ఎంతో సంపాదించానని అన్నారు. అవన్నీ అశాశ్వతం అని అన్నారు. సిద్ధులు, యోగుల్లో ఉండే ప్రశాంతతలో తన వద్ద 10 శాతం ప్రశాంతత కూడా లేదని పేర్కొన్నారు.

నేను గొప్ప నటుడినని అందరూ అంటుంటారు. ఇది ప్రశంసో, విమర్శో అర్థం కావడం లేదు. రాఘవేంద్ర, బాబా.. ఈ రెండు సినిమాలు నాకు ఆత్మ సంతృప్తినిచ్చాయి. బాబా సినిమా చూశాక చాలామంది హిమాలయాలు వెళ్లామని చెప్పారు. నా అభిమానులు కొందరైతే సన్యాసులుగా మారిపోయారు.. కానీ నేను మాత్రం నటుడిగా ఇక్కడే కొనసాగుతున్నానని అన్నారు.