More

    తండ్రి అస్థికలను కృష్ణా నదిలో కలిపేందుకు విజయవాడ వచ్చిన మహేశ్ బాబు

    సూపర్ స్టార్ మహేష్ బాబు సోమవారం ఉదయం విజయవాడ చేరుకున్నారు. కుటుంబ సభ్యులు అందరితో హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానం లో విజయవాడ వచ్చారు. విజయవాడ విమానాశ్రయం నుండి కృష్ణా నదిలో తండ్రి కృష్ణ గారి అస్తికలు కలపడానికి మహేష్ బాబు మరియు కుటుంబ సభ్యులు ప్రత్యేక వాహనాల్లో వెళ్లారు. మహేష్ బాబు వెంట, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మెహెర్ రమేష్, చిన్నాన్న ఆదిశేషగిరి రావు, బావాలు సంజయ్ స్వరూప్, గల్లా జయదేవ్, సుధీర్ బాబు లు వెళ్లారు. సూపర్ స్టార్ కృష్ణ ఈనెల 14వ తేదీన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. కృష్ణ అంత్యక్రియలు 16వ తేదీన హైదరాబాద్ లోని మహాప్రస్థానం లో నిర్వహించారు.

    Trending Stories

    Related Stories