జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం…భారీ బందోస్త్ మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. కిలోమీటరు మేర అంతిమ యాత్రలో పాల్గోన్న సూపర్ స్టార్ అభిమానులు.. తమ అభిమాన హీరోని కడసారి చూసేందుకు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. గుండెపోటుతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కార్డియాక్ అరెస్ట్ మేజర్ బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో కన్నుమూశారు.
తెలుగువారి సూపర్ స్టార్ కృష్ణ… ఆయనే అల్లూరి.. ఆయనే మన జేమ్స్ బాండ్ అంటూనే…అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం.. తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్‌కు, కృష్ణ కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.