More

    ముగిసిన ఐపీఎల్ మెగా వేలం.. సన్ రైజర్స్ కొనుక్కున్న జట్టు ఇదే..!

    ఐపీఎల్-2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. వేలం సమయంలో వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్ వంటి కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. నికోలస్ పూరన్ కోసం సన్ రైజర్స్ ఏకంగా రూ. 10.75 కోట్లు ఖర్చు చేసింది. ఫ్రాంచైజీ అంతకుముందు ముగ్గురు ఆటగాళ్లను తమ జట్టులో ఉంచుకోవడానికి 22 కోట్లు వెచ్చించింది. కేన్ విలియమ్సన్‌ను రూ. 14 కోట్లు, అబ్దుల్ సమద్ రూ. 4 కోట్లు, ఉమ్రాన్ మాలిక్ రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకుంది. వేలంపాటలో ఈసారి 68 కోట్లను దాదాపు సన్ రైజర్స్ ఖర్చు పెట్టింది.

    ఐపీఎల్ వేలం-2022 తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) పూర్తి జట్టు:

    కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, టి నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, కార్తిక్ త్యాగి, శ్రేయాస్ గోపాల్, జగదీశ సుచిత్, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సెన్, రొమారియో షెపర్డ్, సీన్ అబ్బోట్ , ఆర్ సమర్థ్, సౌరభ్ దూబే, శశాంక్ సింగ్, విష్ణు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఫజల్హాక్ ఫరూకీ.

    ఈ ఐపీఎల్ లో అత్యధిక వేలం పలికిన ఆటగాడు భారతీయుడే..! ఇషాన్ కిషన్ ను సొంతం చేసుకోడానికి ముంబై ఇండియన్స్ భారీగా ఖర్చు చేసింది. IPL 2022 మెగా వేలం ప్రారంభ రోజున 15.25 కోట్ల రూపాయల విన్నింగ్ బిడ్‌తో.. IPL వేలం చరిత్రలో కొనుగోలు చేసిన రెండవ అత్యంత ఖరీదైన భారతీయ ఆటగాడిగా 23 ఏళ్ల ఇషాన్ కిషన్ నిలిచాడు.

    ఐదు సార్లు ఛాంపియన్‌ అయిన ముంబై ఇండియన్స్ కీపర్ బ్యాట్స్మెన్ బేస్ ధర INR 2 కోట్ల వద్ద బిడ్డింగ్‌లోకి ప్రవేశించారు. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల నుండి పోటీ వచ్చినా కూడా ఇషాన్ ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ముంబై భావించింది. ముంబై బృందంలో అత్యధికంగా సంపాదించిన రెండవ వ్యక్తిగా నిలిచాడు. 16 కోట్లకు రిటైన్ చేయబడిన రోహిత్ శర్మ తర్వాత భారీ మొత్తంలో ముంబై ఇండియన్స్ నుండి డబ్బులు అందుకుంటూ ఉన్నది ఇషాన్ కిషనే..!

    Trending Stories

    Related Stories