మసీదుపై దాడి ఘటన.. చైనాలో బయట పడ్డ లింక్స్

0
720

ఆఫ్ఘనిస్తాన్ లోని ఈశాన్య ప్రాంత నగరం కుందుజ్ లో శుక్రవారం నాడు భారీ ఉగ్రదాడి జరిగింది. ఓ మసీదులో జరిగిన ఈ పేలుడులో 100 మంది వరకు చనిపోయారని పలు మీడియా సంస్థలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నం ముస్లింలు జుమ్మా నమాజ్ ను నిర్వహిస్తూ ఉండగా.. ఈ దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో మసీదులో 300 మంది ఉన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ‘సున్నీ’ ముస్లిం గ్రూప్ అయిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖోరాసన్ ప్రావిన్స్ (ISKP) ఈ ఘోరమైన దాడికి పాల్పడింది. గాయపడిన మరియు మరణించిన వారి సంఖ్య 100 అని ప్రాథమిక నివేదికలు సూచించాయి. తాలిబ్ మతుల్లా రోహానీ సుమారు 43 మంది మరణించారని.. 140 మంది గాయపడ్డారని సమాచారం అందించారు. షియా నాయకుడు సయీద్ అహ్మద్ షా హషేమి మరణాల సంఖ్యను 70కి పైగానే అని అన్నారు. దాడి చేసిన వ్యక్తి మహమ్మద్ అల్-ఉయ్‌గురిగా గుర్తించబడింది మరియు చైనాలోని ముస్లిం ఉయ్‌ఘర్ మైనారిటీకి చెందినవాడని తేలింది. అతను శుక్రవారం నాడు ప్రార్థనల సమయంలో మసీదు ఆవరణలో తన సూసైడ్ బాంబర్ జాకెట్ తో వచ్చి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 50-100 మందిని చంపాడు.

షియా ముస్లింలను టార్గెట్ చేస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖోరాసన్ ప్రావిన్స్(ఐ.ఎస్.కె.పి.)

ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల తాలిబాన్ అధికారంలోకి రావడంతో ఐ.ఎస్.కె.పి. షియా ముస్లింలను టార్గెట్ చేసుకుని చంపడం మొదలు పెట్టింది. ముఖ్యంగా హజారా కమ్యూనిటీలో మరింత భయం పెరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖోరాసన్ ప్రావిన్స్ తీవ్రవాద సున్నీ సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది. ఆగస్టు 26 న కాబూల్ విమానాశ్రయంలో జరిగిన బాంబు దాడితో సహా అనేక ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొంది. కాబూల్ విమానాశ్రయంలో జరిగిన బాంబు దాడిలో 13 మంది అమెరికా సైనికుల ప్రాణాలు కోల్పోయారు. ఐ.ఎస్.కె.పి. ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్ (ISIS) యొక్క ఒక శాఖ. ఖోరాసన్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ మరియు తుర్క్మెనిస్తాన్‌లతో కూడిన చారిత్రక ప్రాంతాన్ని సూచిస్తుంది.. ఒకప్పుడు ఖలీఫా నియంత్రణలో ఉండే భూభాగాలు ఇవి. ఐ.ఎస్.కె.పి. ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్‌లోని మదరసాలలో చదువుతున్న అనేకమంది విద్యార్థులను కూడా ప్రభావితం చేసింది, ఐ.ఎస్.కె.పి. బాలికల పాఠశాలలపై దాడులు చేసింది. గర్భిణులు మరియు నర్సులను కాల్చి చంపింది. వారి ప్రాథమిక లక్ష్యం షియా ముస్లింలు (ఆఫ్ఘనిస్తాన్ జనాభాలో 20%), వారు ప్రధానంగా హజారా కమ్యూనిటీ నుండి వచ్చారు. కొత్తగా స్థాపించబడిన తాలిబాన్ ప్రభుత్వం హజారాలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమైంది.