More

    హైదరాబాద్ నగర రోడ్ల దుస్థితి: అధికార పార్టీ ఎమ్మెల్యే కారు ఇరుక్కుపోయె

    గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు కాలనీల్లో జనాలు కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వరద ముంపుకు గురైన కాలనీల్లో ఈ ఉదయం పర్యటించారు. హస్తినాపురం కాలనీకి వచ్చే సమయానికి ఆయన ప్రయాణిస్తున్న కారు వరద నీటిలో చిక్కుకుంది. కారును ముందుకు తోసేందుకు ఆయన వెంట ఉన్నవారు ప్రయత్నించినా కారు కదలలేదు. ఆయన కూడా కిందకు దిగి కారును తోశారు. అయినా కారు కదలకపోవడంతో వరద నీటిలోనే ఆయన నడుచుకుంటూ వెళ్లిపోయారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు వరద నీళ్లలో ఇరుక్కుపోవడంతో దానిని బయటకు తీసుకురావడం కోసం సదరు ఎమ్మెల్యే నానాతంటాలు పడ్డ వీడియో వైరల్ గా మారింది. సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేనే వరదలో చిక్కుకుని అష్టకష్టాలు పడడం హైదరాబాద్ మహానగర రోడ్ల దుస్థితికి అద్దం పడుతోంది.

    తాజాగా కురిసిన వర్షాలతో హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూసీనది పొంగి ప్రవహిస్తోంది. ఉప్పల్, హయత్ నగర్, సరూర్ నగర్, నాగోల్, ఓల్డ్ సిటీ ప్రాంతాలలో వరద నీరు ముంచెత్తింది.

    Trending Stories

    Related Stories