విడుదలై సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. స్టంట్ మాస్ట‌ర్ సురేష్‌ మృతి

0
721

తమిళ సినిమా ‘విడుదలై’ షూటింగ్‌లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తుండ‌గా స్టంట్ మాస్ట‌ర్ సురేష్‌ ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించాడు. వెట్రిమార‌న్ దర్శకత్వంలో ‘విడుద‌లై’ అనే త‌మిళ చిత్రం తెర‌కెక్కుతోంది.ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్ర షూటింగ్ చైన్నై శివార్ల‌లో జ‌రుగుతోంది. వండలూరు సమీపంలోని ఉనమంచెరిలో సన్నివేశం కోసం రైలు పట్టాల సెట్‌ను నిర్మించారు. అందులో రైలు ప్రమాదానికి గురైన‌ట్లుగా చిత్రీకరిస్తున్నారు. శనివారం ఉదయం సురేష్‌తో సహా కొంతమంది నటులను భారీ క్రేన్‌కు బిగించి తాళ్లతో కట్టివేశారు. అయితే.. ప్ర‌మాద‌వ‌శాత్తు సురేష్‌కు క‌ట్టిన తాడు తెగిపోయింది. దాదాపు 20 అడుగుల పై నుంచి కింద ప‌డ‌డంతో అత‌డికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. ఆయ‌న్ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు.

ప్రముఖ తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్, హీరో సూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘విడుదలై’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన యాక్షన్ చిత్రాలను తెరకెక్కిస్తున్న సమయంలోనే స్టంట్ మాస్టర్ సురేష్ ప్రమాదవశాత్తూ కిందపడిపోయి మృతి చెందాడు. స్టంట్ మాస్టర్ మృతితో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.