పల్నాడు జిల్లా గురజాలలో విషాదం చోటు చేసుకుంది. గురజాలలోని ఓ మదర్సాలో మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఒక విద్యార్థి మృతి చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వండిన ఆహారం కలుషితం కావడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శాంపిళ్లను సేకరించారు.
మదర్సాలో 11 మంది విద్యార్థులు ఖురాన్ అభ్యసిస్తున్నారు. ఒక్కసారిగా మధ్యాహ్నం భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అస్వస్థతకు గురైన విద్యార్థులకు గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.