ఓ వైపు మ్యాచ్ ఆడుతుండగా.. మరో వైపు సొంత పబ్ లో అగ్నిప్రమాదం

0
875

ఇంగ్లండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ కు చెందిన టాప్ అండ్ రన్ పబ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. స్టూవర్ట్ బ్రాడ్, మాజీ ఆటగాడు హ్యారీ గుర్నీతో కలిసి నాటింగ్ హామ్ షైర్ లో పబ్ నిర్వహిస్తున్నాడు. అప్పర్ బ్రాటన్ ప్రాంతంలో ఉన్న ఈ పబ్ లో వేకువ జామున మంటలు చెలరేగాయి. ఓ వైపు స్టువర్ట్ బ్రాడ్ మ్యాచ్ ఆడుతూ ఉండగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బ్రాడ్ మాజీ సహచరుడు హ్యారీ గుర్నీ సహ-యాజమాన్యమైన పబ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:22 గంటలకు మొదటి అంతస్తు నుండి మంటలు చెలరేగడంతో అప్పర్ బ్రౌటన్‌లోని పబ్ తీవ్రంగా దెబ్బతింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని.. నాటింగ్‌హామ్‌షైర్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ శనివారం ఉదయం తెలిపింది. ఈ ప్రమాదంలో ఆస్తికి తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు.

తీవ్రంగా శ్రమించి మంటలను చాలావరకు అదుపులోకి తెచ్చారు. అప్పటికే పబ్ పైకప్పు సహా భవనంలోని చాలా భాగం కాలిపోయింది. గణనీయమైన స్థాయిలోనే ఆస్తినష్టం జరిగినట్టు అగ్నిమాపక దళ సిబ్బంది తెలిపారు. బ్రాడ్ ప్రస్తుతం న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరుగుతోంది. గర్నీతో పాటు బ్రాడ్ ఈ పబ్ ను 2016లో ప్రారంభించారు. ది క్యాట్ & వికెట్స్ పబ్ కంపెనీ నిర్వహిస్తున్న పబ్‌లో అగ్నిప్రమాదం వల్ల ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.
నాటింగ్‌హామ్‌షైర్ ఫైర్ అండ్ రెస్క్యూ వద్ద స్టేషన్ మేనేజర్ జొనాథన్ విల్సన్ భవనం చాలా తీవ్రంగా దెబ్బతిన్నట్లు ధృవీకరించారు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు నిర్వహించనున్నారు.