More

    పేద విద్యార్థుల మతం మారుస్తున్న సెయింట్ జోసెఫ్ స్కూలు యాజమాన్యం.. ఆగ్రహించిన ప్రజలు

    పేద పిల్లల మత మార్పిడికి పాల్పడినందుకు స్కూలు యాజమాన్యంపై స్థానికులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందూ సంఘాల కార్యకర్తలు, స్థానికులు సోమవారం నాడు మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలోని గంజ్ బసోడా పట్టణంలోని క్రైస్తవ మిషనరీ పాఠశాల అయిన సెయింట్ జోసెఫ్ పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి, రాళ్లు రువ్వారు.12వ తరగతి విద్యార్థులు పరీక్ష హాల్‌లో గణిత పరీక్షకు హాజరవుతున్న సమయంలో పాఠశాల ఆవరణలో ఈ ఘటన చోటు చేసుకుంది. హింసాత్మక గుంపులు విసిరిన రాళ్లతో పాఠశాల భవనం అద్దాలు ధ్వంసమయ్యాయి.

    ఎనిమిది మంది హిందూ పేద పిల్లలను మతం మార్చారని ఆరోపణలు వచ్చాయి. ఇటీవల పాఠశాలలో ఎనిమిది మంది పేద హిందూ పిల్లలను మతమార్పిడి చేసినట్లు చిత్రాల, నివేదికల నేపథ్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించామని స్థానిక బజరంగ్ దళ్ నాయకుడు నీలేష్ అగర్వాల్ తెలిపారు. “ఎనిమిది మంది హిందూ పిల్లలను మత మార్పిడికి పాఠశాల యాజమాన్యం పాల్పడింది, ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి పాఠశాల భవనాన్ని సీజ్ చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక పరిపాలనను డిమాండ్ చేసాము. పాఠశాల విరాళంగా ఇచ్చిన స్థలంలో నిర్మించబడింది. పాఠశాల యాజమాన్యం పిల్లలను మత మార్పిడికి పాల్పడినట్లు నిర్థారణ అయితే, భూమిని తిరిగి స్వాధీనం చేసుకోమని మేము భూమి ఇచ్చిన దాతను కోరుతాము ” అని అగర్వాల్ చెప్పుకొచ్చారు.

    పాఠశాల ద్వారా పిల్లల మత మార్పిడిపై విచారణ ప్రారంభించబడిందని.. ఈ విషయంలో పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు. హింస గురించి తెలుసుకున్న విదిషా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మోనికా శుక్లా గంజ్ బసోడా పట్టణానికి చేరుకున్నారు. మొత్తం విషయం విచారణలో ఉందని, తప్పు చేసిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని చెప్పారు. గంజ్ బసోడా పట్టణంలోని సెయింట్ జోసెఫ్ పారిష్ ద్వారా 2021 అక్టోబర్ 31న ఎనిమిది మంది పిల్లలను మత మార్పిడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు చేయాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR) చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో ఇటీవల విదిషా జిల్లా కలెక్టర్ ఉమాశంకర్ భార్గవ్‌కు లేఖ రాశారు.

    సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో ఎనిమిది విద్యార్థులను నిర్వాహకులు మతం మార్చారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు రాగా.. పాఠశాలపై దాడి ఘటన చోటు చేసుకుంది. స్థానిక బజరంగ్‌దళ్‌ నేత నీలేశ్‌ అగర్వాల్‌ ఆరోపించిన మత మార్పిడిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. విధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పుకొచ్చారు.

    Trending Stories

    Related Stories