ఏపీలో కూడా బుల్ డోజర్ సిస్టమ్ రావాలని బీజేపీ నేత కాంక్షించారు

0
912

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఆదివారం హిందూ సంస్థల ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించగా.. ఆ సమయంలో రాళ్ల దాడి జరిగినట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ కో-ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ తెలిపారు. ర్యాలీకి అధికారుల నుండి నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకున్నారు. అయితే.. ర్యాలీ కొనసాగుతుండగా, కొందరు వ్యక్తులు నినాదాలు చేస్తూ శోభాయాత్రపై దాడి చేసినట్లు ఆరోపించారు.

రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ప్రవర్తిస్తోందని సునీల్ దేవధర్ తీవ్రంగా స్పందించారు. నెల్లూరులో టీటీడీ కళ్యాణమండపం నుండి ప్రారంభమై స్టోన్ హౌస్ పేట వరకు శోభా యాత్ర సాగుతున్న సమయంలో, మద్రాస్ బస్టాండ్ సమీపంలో యాత్రపై కొందరు మతఛాందసవాద వాదులు ఒక్కసారిగా రాళ్లు, బీరుబాటిళ్లతో దాడి చేశారని ఆయన అన్నారు. హనుమంతుడి విగ్రహంపై కూడా దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ఇలాంటి సంఘటనలను బీజేపీ చూస్తూ ఉరుకోదని హెచ్చరించారు. దాడులు జరుగుతున్నప్పటికీ అధికార పార్టీ కళ్ళప్పగించి చూస్తోందని, ప్రతిపక్ష తెదేపా కూడా మౌనం వహిస్తోందని అన్నారు. రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ర్యాలీ ప్రశాంతంగా ముగిసిందని నెల్లూరు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) తెలిపారు. అయినప్పటికీ రెండు గ్రూపులను పీస్ మీటింగ్ కు పిలవాలని నిర్ణయించింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సునీల్ దేవధర్ షేర్ చేశారు. “How long are you going to test the patience of Hindus?” He also said Andhra Prades “need #buldozerjustice” అంటూ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బుల్ డోజర్ జస్టిస్ రావాలని పిలుపును ఇచ్చారు.