More

    ప్రజా సంగ్రామ యాత్రపై రాళ్లతో దాడి.. ఫైర్ అయిన బండి సంజయ్

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. దేవరుప్పుల మండలం లో బండి సంజయ్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ పాదయాత్ర పై టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. బండి సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలో టిఆర్ఎస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘర్షణలో కొందరికి గాయాలయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ఘర్షణకు దారి తీసింది.

    ఇరు వర్గాల రాళ్ల దాడితో దేవరుప్పలలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. తనపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించారు బండి సంజయ్. పోలీస్ సెక్యూరిటీని తిరస్కరించారు. తన భద్రతను బీజేపీ కార్యకర్తలే చూసుకుంటారని చెప్పుకొచ్చారు. పోలీస్ కమిషనర్ తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ చేతకాని సీపీ ఇంట్లో కూర్చోవాలని అన్నారు. డీజీపీతో నేరుగా ఫోన్లో మాట్లాడారు బండి సంజయ్ కుమార్. బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులకు జీతాలు కేసీఆర్ జేబుల్లోంచి ఇస్తున్నారా? అని నిలదీశారు. కేసీఆర్ ఉండేది ఇంకో 6 నెలలే అన్నారు బండి సంజయ్. తక్షణమే పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చూడాలన్నారు. లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

    spot_img

    Trending Stories

    Related Stories