మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రేకు బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. రాజ్ ఠాక్రేను హతమారుస్తామని రెం డు రోజుల కిందట బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత బాల నాంద్‌గావ్కర్ బుధవారం హోంమంత్రి దిలీప్ వల్సే పాటిల్‌తో భేటీ అయి ఈ విషయా న్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై వాస్తవాలు ఆరా తీసిన మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం భద్రత పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం రాజ్ ఠాక్రేకు వై–ప్లస్ భ ద్రతా ఉంది. బెదిరింపు లేఖ వచ్చిన తరువాత ప్రభుత్వం ఈ భద్రతను ఇలాగే కొనసాగిస్తూ అదనంగా పోలీసుల సంఖ్య పెంచింది. ఇందు లో అదనంగా ఒక పోలీసు అధికారి, కానిస్టేబుల్ ఉన్నారు. బెదిరింపు లేఖ హిందీలో ఉన్నప్పటకీ అందులో వాడిన పదాలు ఎక్కువ శాతం ఉర్దూలో ఉన్నాయి. దీంతో రాజ్‌కు ఏదైనా హాని జరిగితే మహారాష్ట్ర తగలబడకుండా ఉండదని నాంద్‌గావ్కర్ హెచ్చరించారు.
లౌడ్‌స్పీకర్ల వివాదం తెరమీదకు వచ్చిన తరువాత తమకు అనేక బెదిరింపు లేఖలు వస్తున్నాయని నాంద్‌గావ్కర్ అన్నారు. రాజ్ ఠాక్రేను హతమారుస్తామని ఇలా బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. లౌడ్‌స్పీకర్లలో నమాజ్ వినిపించడాన్ని అడ్డుకుంటున్న విధానం మానుకోవాలని, లేదంటే నిన్ను, రాజ్ ఠాక్రేను వదిలే ప్రసక్తే లేదు. కచ్చితంగా హతమారుస్తామని రాసి ఉంది. ఈ లేఖను రాజ్ ఠాక్రేకు చూపించిన తరువాత పోలీసు కమిషనర్‌తో భేటీ అయినట్లు ఆయన తెలిపారు. దీంతో రాజ్‌కు భద్రత మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అలాగే లౌడ్ స్పీకర్ వివాదానికి తెరలేపిన రాజ్ థాక్రేపై పేరు ప్రస్తావించకుండా అక్బరుద్దీన్ విమర్శలు గుప్పించారు. తాను ఎవరిని చెడ్డవారిగా చూపించడానికి ఇక్కడకి రాలేదని ఆయన అన్నారు. కనీసం గుర్తింపు పొందే అర్హతలేని వారికి ఎందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కుక్కలు మొరిగితే మొరగనివ్వండి. కుక్కల పని మొరగడమే. సింహాలు తమ దారిన తాము నడుచుకుంటూ వెళ్తాయని అక్బరుద్దీన్ అన్నారు. అక్బరుద్దీన్ ఔరంగజేబు సమాధిని సందర్శించడం ద్వారా మతవిద్వేషాలను పెంచుతున్నారంటూ శివసేన, బీజేపీలు మండిపడ్డాయి. ఒవైసీ మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నారని శివసేనకు చెందిన చంద్రకాంత్ ఖైరే ఆరోపించారు. క్రూరమైన మొఘల్ చక్రవర్తి సమాధిని సందర్శించినందుకు అక్బరుద్దీన్ ఒవైసీపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన కోరింది. చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంటుందని ఎంఎన్ఎస్ నేత గజానన్ కాలే అన్నారు. అదేవిధంగా అక్బరుద్ధీన్ ఒవైసీపై దేశద్రోహం కేసు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది.