ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2023ను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నారు. అర్హులైన వారందరూ ఓటరుగా నమోదవ్వడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ పర్యటించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్, ఐటీడీఏ పీఓ గౌతమ్ పోట్రోతో పాటు సంబందిత జిల్లా అధికారులతో కలిసి ఆయన భద్రాచలం, మొరంపల్లి బంజర్‌లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులపై బూత్ లెవల్ ఆఫిసర్లను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ నమోదు రిజిష్టర్లను తనిఖీ చేశారు. అనంతరం భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్శహించారు.