ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచిన ఎస్బీఐ

0
874

సీనియర్‌ సిటిజన్లకు భారతీయ స్టేట్‌బ్యాంక్‌ (ఎస్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. సీనియర్‌ సిటిజన్లకు సంబంధించి రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచింది. సెలెక్టెడ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ టెన్యూర్‌లపై 80బేసిక్‌ పాయింట్లు వడ్డీ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మొత్తాన్ని బట్టి 25 బేసిక్‌ పాయింట్ల నుంచి 80 బేసిక్‌ పాయింట్ల వరకు వడ్డీరేట్లు పెరుగుతాయి. ఇంతకుముందు ఈ నెల 15న రిటైల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 20 బేసిక్‌ పాయింట్ల వడ్డీ పెంచింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేట్లు వారంలో రెండుసార్లు పెంచినట్లయింది. 211 రోజుల నుంచి ఏడాది లోపు గడువు గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు 90 బేసిక్‌ పాయింట్లు పెరిగింది. తాజా పెంపుతో సీనియర్ సిటిజన్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై గరిష్ఠంగా 7.9 శాతం వడ్డీ లభిస్తుంది. ఎస్బీఐ ఉద్యోగులు, పెన్షనర్లకు మరో ఒక శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేండ్ల నుంచి పదేండ్ల లోపు సీనియర్‌ సిటిజన్ల రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 6.65% నుంచి 6.9 శాతానికి వడ్డీరేటు పెరిగింది. మూడేండ్ల నుంచి ఐదేండ్ల లోపు టెన్యూర్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు 30 బేసిక్‌ పాయింట్లు పెరిగి 6.30% నుంచి 6.60% శాతానికి చేరింది. రెండేండ్ల నుంచి మూడేండ్ల లోపు గడువు గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 60 బేసిక్‌ పాయింట్లు పెరిగి 6.15% నుంచి 6.75% శాతానికి పెరుగుతుంది. 46 నుంచి 179 రోజుల మధ్య ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేటు 4.50% నుంచి ఐదు శాతానికి చేరుకుంది. 180 రోజుల నుంచి 210 రోజుల వరకు 5.15% నుంచి 5.75% ఉంది.