చిత్రావతి నదికి వరద ఉధృతి

0
816

శ్రీ సత్యసాయి జిల్లా: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిత్రావతి నదికి వరద పోటెత్తింది. జిల్లాలో హిందూపురం, పుట్టపర్తి,పెనుగొండ నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వరద ఉధృతి పెరగడంతో పుట్టపర్తిలోని చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సంవత్సరంలో ఒకేసారి మూడుసార్లు చిత్రావతికి వరద పోటెత్తింది. దీంతో చిత్రావతి నది పరవళ్ళు తొక్కుతోంది. పెడపల్లి, రాయలవారిపల్లి, కోవెల గుట్టపల్లి, చిత్రావతి డ్యాంలు నిండి మత్తడి దూతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిత్రావతి నది నుంచి పెద్దఎత్తున వరద పోటెత్తడంతో జిల్లాలోని అతిపెద్ద చెరువైన బుక్కపట్నం 30సంవత్సరాల తర్వాత నిండి మరవ పారుతోంది. బుక్కపట్నం చెరువు నిండటంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

14 − 12 =